అన్నవరంలో కరోనా కలకలం... మరో 29 మంది సిబ్బందికి పాజిటివ్...
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో కరోనా కలకలం రేపుతోంది. అన్నవరంలోని శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మరో 29 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. శనివారం(అగస్టు 8) మొత్తం 300 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా... 29మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఇప్పటివరకూ వైరస్ బారినపడినవారి సంఖ్య 39కి చేరింది. అంతకుముందే 10 మంది అర్చకులు,సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.
అన్నవరం గ్రామంలోనూ ఇప్పటికే 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కలకలం నేపథ్యంలో ఈ నెల 14వరకూ దర్శనాలు,వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. స్వామి వారికి ఏకాంత నిత్య సేవలు నిర్వహిస్తామని పేర్కొంది.

ఇటీవల టీటీడీ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అప్పటినుంచి టీటీడీ అర్చకుల్లోనూ ఆందోళన మొదలైంది. దీనిపై పలువురు అర్చకులు గోవింద నిలయంలో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రితోనూ చర్చించినట్లు సమాచారం. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్వామి వారి కల్యాణోత్సవ సేవను ఈ నెల 31 వరకూ నిలిపివేయాలని అర్చకులు డాలర్ శేషాద్రికి సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తరుచూ 10వేల మార్క్‌ని తాకుతోంది. వరుసగా 3 రోజుల నుంచి 10వేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే కొత్తగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040కి చేరింది. కరోనాతో మరో 97 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1939కి చేరింది.
-
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications