రైల్వేశాఖ బంపర్​ ఆఫర్‌, వీరికి టికెట్ ధరల్లో భారీ రాయితీ..!!

రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. తాజాగా ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఇప్పుడు ప్రయాణీకుల కోసం మరో నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పై రాయితీ ప్రకటించింది. అయితే, ఇందు కోసం నిర్ణీత సమయంతో పాటుగా రాయితీ వినియోగం పైన విధి విధానాలు ఖరారు చేసింది. సంక్రాంతి నుంచి ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రెగ్యులర్ గా ప్రయాణాలు చేసే సాధారణ ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది.

రైల్వే శాఖ టికెట్ల పై రాయితీ ప్రకటించింది. రైల్‌వన్‌ యాప్‌ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న ప్రయాణీకులు ఈ రాయితీ వర్తిస్తుంది. డిజిటల్‌ పేమెంట్‌ మోడల్‌లో రైల్‌వన్‌ యాప్‌ ద్వారా అన్‌రిజర్వుడు టికెట్లను కొనుగోలు చేస్తే 3శాతం డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

3 per cent discount on unreserved tickets via RailOne app for all digital payments

ప్రస్తుతం రైల్‌వన్‌ యాప్‌లో ఆర్‌-వాలెట్‌ ద్వారా టికెట్‌ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్‌బ్యాక్‌ యథాతథం గా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్‌రిజర్వుడు టికెట్‌లకు ఈ ఆఫర్‌ వర్తించదని క్లారిటీ ఇచ్చింది. డిజిటల్‌ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

రైల్‌వన్‌ యాప్‌ ద్వారా అన్‌రిజర్వుడు మరియు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను ఏ డిజిటల్ పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్) ద్వారా కొనుగోలు చేసినా ఈ 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కాగా, ఈ స్పెషల్​ ఆఫర్ 2026 జనవరి 14 నుండి జూలై 14 వరకు (ఆరు నెలలు) మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైలు టికెట్‌, ప్లాట్‌ఫామ్‌ టికెట్‌, ట్రైన్‌లైవ్‌ ట్రాకింగ్‌, జర్నీలో ఫుడ్‌ బుకింగ్‌ ఇవన్నీ ఒక్క చోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే 'రైల్‌వన్‌ యాప్‌'ను అందుబాటు లోకి తీసుకొచ్చింది.

ఈ యాప్‌ ద్వారా టిక్కెట్లు బుక్ చేయడంతో పాటు లైవ్ ట్రైన్ స్టేటస్, ప్లాట్‌ ఫామ్ వివరాలు, ఆహార ఆర్డర్లు కూడా చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి మరియు సామాన్యులను డిజిటల్ బాట పట్టించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ ధరతో సులభంగా తమ ప్రయాణాన్ని సాగించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+