మహిళతో అసభ్య ప్రవర్తన, కానిస్టేబుల్‌కు ఐదేళ్ల జైలు

5 year jail to constable for harassing woman
హైదరాబాద్: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ పోలీసు కానిస్టేబుల్‌కు న్యాయస్థానం ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా 8వ సహాయ సెషన్స్ న్యాయమూర్తి వెంకటరమణ శనివారం నాడు ఈ తీర్పు ఇచ్చారు. అదనపు పీపీ ఎం గంగారెడ్డి కథనం ప్రకారం.. వైజాగ్‌కు చెందిన రాజేష్ నార్సింగిలో పని చేస్తున్న కానిస్టేబుల్ ఓ ఇంట్లోకి చొరబడి గృహిణితో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ సంఘటన 2013 ఆగస్టు 12వ తేదీన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండుకు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. న్యాయస్థానం అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

నగలు, నగదు చోరీ

హైదరాబాదు నగరంలోని వనస్థలిపురంలో ఓ అపార్ట్ మెంట్‌లోని ఇంట్లో శనివారం అర్ధరాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని హుడా సాయినగర్‌లోని కల్పనా ఎన్ క్లేవ్ లో ఆగంతుకులు 55 తులాల బంగారు నగలతో పాటు చేతికందిన రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+