50 కేజీల స్వీట్స్.. 100 కేజీల డ్రై ప్రూట్స్, 10 మేకపోతులు.. ఇదీ ఆషాడం సారె
సారె.. పెళ్లయిన తర్వాత కూతురికి పంపిస్తారు. సనాతన హిందు సంప్రదాయంలో ఇదీ కొనసాగుతోంది. అయితే సారెను ఒక్కొక్కరు ఒకలా చూస్తారు. ఇక ఏపీలో అయితే ఎక్కువ ఆచార, సాంప్రదాయాలు ఉంటాయి. రాజమండ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మర్యాదకు పెట్టింది పేరు. గౌరవించడం, సారె పంపడం అంటే రాజమండ్రే గుర్తుకురావాలి.
Recommended Video


మర్యాదకు పెట్టింది పేరు..
గోదావరి మహారాష్ట్రలో పుడితే మర్యాదలు గోదావరి జిల్లాలో పుట్టాయనే సామెత ఊరికే రాలేదు. వ్యాపారవేత్త బత్తుల బలరామకృష్ణ కూతురు ప్రత్యూషకు ఇటీవల యానాంకి చెందిన తోట రాజు గారి కుమారుడు పవన్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సారె పంపడం కామనే.. కానీ బలరామకృష్ణ మాత్రం సారె అంటే ఇలా ఉండాలనేటట్టు చేశారు.

100 కేజీల డ్రై ప్రూట్స్
వియ్యంకుడి ఇంటికి పంపిన ఆషాడం సారె అందరినీ ఆశ్చర్య పరిచింది. సారె అంటే మాములు సారె పంపించలేదు. వాటిని చూసి యానాం యానమే నోరెళ్లబెట్టింది. ఇంటి ఇంటికీ సారె పంచిన అయిపోలేదు. స్టీల్ బిందెలలో 50 కేజీల స్వీట్స్, హాట్స్ పంపించారు. అలాగే 250 కేజీల కిరాణా సామాను కూడా సపరేట్‌గా పెట్టారు. 100 కేజీల డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేయించారు.

250 కేజీల బొమ్మిడాలు
టన్ను చొప్పున కొర్రమీను, పండుగ గప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250 కేజీల బొమ్మిడాయిలు,10 మేక పోతులు, 50 కోళ్లు, 2 మేకలకి చెవులకి బంగారు రింగులు, 200 ఆవకాయ జాడీలు, 5 వాహనాలు కావిళ్ళతో పంపిన సారె పంపించారు. దానిని చూసి ఊరంత అబ్బురపరచింది. ఆ సారెని ఊరిలో తెలిసిన వారందరికీ పంచారని, ఇప్పటి దాకా ఎవరూ వినని, చూడని సారెను, ఊరంతా చూసి, సంబర పడుతున్నారు.

పెళ్లికి సరిపడ..
కూతురు అంటే మమకారం.. అల్లుడిపై అప్యాయత కలిసి భారీ సారెను పంపించారు. ఆ సారె చూసి జనం అంతా షాక్ తిన్నారు. అబ్బో ఇంతలా సారె పంపడం ఏంటీ.. ఖర్చు ఏమాత్రం అయ్యింది అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటు ఓ పెళ్లికి సరిపడ ఆహార పదార్థాలు పంపించారని అంతా అనుకుంటున్నారు.
Photo Courtesy: Srinivas Kondreddi












Click it and Unblock the Notifications