52 పెళ్లిల్లు చేసుకున్నాడు: బంగారంతో పరారీ, అరెస్ట్

52 Marriages Srinivas Arrest
హైదరాబాద్: ఓ నిత్య పెళ్లి కొడుకు కటకటాలపాలయ్యాడు. పలువురు యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి బంగారు ఆభరణాలతో ఉడాయించే నిత్య పెళ్లి కొడుకును సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ అనే నిందితుడు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ఉంటున్నాడు.

పెళ్లి సంబంధాలు కుదిర్చే సంస్థలకు తన వివరాలు పంపేవాడు శ్రీనివాస్. మంచి ఉద్యోగం, ఆకర్షనీయమైన వేతనం వస్తుందని వెంటనే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని మాయమాటలు చెప్పేవాడు. అతని మాయమాటలకు బోల్తాపడి పెళ్లి చేసుకునేందుకు ఎవరైనా ముందుకు రాగానే వారితో స్నేహం పెంచుకునేవాడు.

ఏదో ఒక కారణం చెప్పి వారివద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుకొని పరారయ్యేవాడు. ఇలా 52 మంది యువతులను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. అంతేగాక ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుని గిన్నిస్ బుక్ ఎక్కాలనే కోరిక కూడా అతనికి ఉందిట. ఇది ఇలా ఉండగా పరువు పోతుందన్న ఉద్దేశంతో ఫిర్యాదు చేయడానికి మోసపోయిన బాధితులెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

కాగా, చివరకు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన సిఐడి అధికారులు గురువారం నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి కాలేదని, మిగితా వివాహాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+