హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగలుగా మారిన 6గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

6 engineering students arrested for snatching chains
హైదరాబాద్: చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను కెపిహెచ్‌బి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆరుగురు విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఏడాదిగా నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ పరిధుల్లో వారు 54 దొంగతనాలకు పాల్పడ్డారు. వారి నుండి పోలీసులు ఒక కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. విలాసవంత జీవితం గడిపేందుకు సులభంగా డబ్బు పొందేందుకు వారు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు.

వారు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. కొద్ది నెలలుగా ఖాకీల కన్నుగప్పి నేరాల మీద నేరాలు చేస్తున్నారు. ఆరుగురు విద్యార్థులు రెండు గ్యాంగులుగా ఈ నేరాలకు పాల్పడుతున్నారు.

పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వారిలో ఒకడు దొరికిపోయాడు. గుట్టంతా బయటపెట్టాడు. అతడి పేరు మహేష్. గుంటూరు జిల్లాకు చెందిన ఇతడు.. హైదరాబాద్ శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. కూకట్‌పల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కొద్దినెలల క్రితం ఇతడు మరో విద్యార్థితో కలిసి చైన్‌స్నాచింగ్‌ల బాటపట్టాడు. వీరిద్దరూ మోటారు సైకిళ్లపై తిరుగుతూ ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడలోని బంగారు ఆభరణాలు లాక్కుపోయేవారు.

ఎక్కడా పోలీసులకు చిక్కకపోవడంతో మరో ఇద్దరు స్నేహితులతో కొత్త గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. వారినీ స్నాచింగ్‌ల్లోకి దించారు.
వీరు నలుగురూ సైబరాబాద్ పరిధిలోని మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి, కెపిహెచ్‌బీ ప్రాంతాల్లో విస్తృతంగా గొలుసు చోరీలు చేశారు. నాలుగు రోజుల క్రితం కెపిహెచ్‌బీ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ రెండు గ్యాంగులకు లీడరైన మహేష్ దొరికిపోయాడు. వాహనం వెనుక కూర్చున్న అతడి స్నేహితుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు.

మహేష్‌ను పోలీసులు విచారించే సరికి గ్యాంగ్ గుట్టు బయటకొచ్చింది. మిగిలిన నిందితులను అరెస్టు చేసే లోపు మహేష్‌ను అరెస్టు చేసిన విషయం అతడి మేనమామకు తెలిసింది. దీంతో ఆయన మహేష్‌ను అరెస్టు చేసి 24గంటలు గడిచినా కోర్టులో హాజరుపరచలేదంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.

దీంతో పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచి ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించి నలుగురితో కూడిన ఈ గ్యాంగ్ సైబరాబాద్‌లో మొత్తం 54 నేరాలు చేసిందని పోలీసులు నిర్ధారించారు.

మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో కూడిన గ్యాంగ్ మాత్రం "ఇల్లు అద్దెకు ఇవ్వబడును'' అని బోర్డు కనిపిస్తే చాలు టక్కున వాలిపోతుంది. వీరి జేబులో ఎప్పుడూ చాకులు ఉంచుకుని కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని గల్లీల్లో తిరిగేవారు. 'ఇల్లు అద్దెకు ఇవ్వబడును' అని బోర్డు కనిపించగానే ఆ ఇంటికి వెళ్తారు. ఇల్లు అద్దెకు కావాలని అక్కడ ఉన్న వారిని అడుగుతారు. ఆ తర్వాత మంచినీళ్లు అడుగుతారు. ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండి, నీళ్లు తీసుకురావడానికి వెళ్లగానే వారి వెనుకే లోపలకు వెళ్తారు. చాకులతో బెదిరించి వారి ఒంటిపై ఆభరణాలు, ఇంట్లో ఉన్న డబ్బులు దోచుకుపోతారు.

English summary
KPHB police arrested six engineering students for chain snatching. According to sources, all the accused were pursuing engineering at various private colleges in the city. They had committed 54 snatching offences under various police station limits in Hyderabad and Cyberabad in the past one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X