Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

78th Independence day: ఎర్రకోటపై త్రివర్ణ పతాక రెపరెపలు

78వ స్వాతంత్ర్యం సంబరాలను ఘనంగా జరుపుకునేందుకు యావత్ భారత్‌ దేశం సిద్ధమైంది. తెల్లదొరల పాలనకు చరమగీతం పాడుతూ 1947 ఆగష్టు 15వ తేదీన భరతమాత స్వేచ్ఛావాయువును పీల్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛతో ఉన్నారంటే నాడు స్వాతంత్ర్య సంగ్రామంలో అలుపెరగక పోరాడిన సమరయోధులు కష్టార్జితమే. బ్రిటీషు వారిని ఎదుర్కొని ప్రాణాలను పనంగా పెట్టి మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు. ఇక నాటి నుంచి నేటి వరకు భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది.

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నినాదం వికసిత్ భారత్ అంటే భారతదేశాభివృద్ధి. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తోంది.ఏటా భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చారిత్రాత్మక ఎర్రకోటపైనే నిర్వహించడం ఆనవాయితీ. దేశ ప్రధాని ఎర్రకోట నుంచి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ సారి ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 11వ సారి దేశానుద్దేశించి ప్రసంగిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డిలు జాతీయ జెండాలను ఎగురవేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మినిట్-టూ-మినిట్ లైవ్ మీకోసం.

78th Independence day Live updates CM chandrababu and Revanth reddy speech and highlights

Aug 15, 2024, 10:55 am IST
ఢిల్లీ

78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.
Aug 15, 2024, 10:55 am IST
ఢిల్లీ

78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా.
Aug 15, 2024, 10:53 am IST
పశ్చిమ బెంగాల్

78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి మమత బెనర్జీ.
Aug 15, 2024, 10:52 am IST
ఢిల్లీ

78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.
Aug 15, 2024, 10:51 am IST
తెలంగాణ

78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Aug 15, 2024, 10:06 am IST
తెలంగాణ

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాసన మండలి ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Aug 15, 2024, 9:52 am IST
ఆంధ్రప్రదేశ్

YS Jagan
78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
Aug 15, 2024, 9:46 am IST
అస్సాం

78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గువాహటిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.
Aug 15, 2024, 9:45 am IST
ఆంధ్రప్రదేశ్

78 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Aug 15, 2024, 9:38 am IST
ఢిల్లీ

2036 నాటికి భారత్‌లో ఒలింపిక్స్ గేమ్స్‌ను నిర్వహించడం భారతీయుల కల అని, దాన్ని సాకారం చేస్తామని వెల్లడించిన ప్రధాని మోదీ
Aug 15, 2024, 9:16 am IST
మహారాష్ట్ర

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.
Aug 15, 2024, 9:15 am IST
ఢిల్లీ

దశాబ్దాల కాలంగా దేశాన్ని అవినీతి పట్టిపీడిస్తోంది. దీనికి వ్యతిరేకంగా మేము యుద్ధం చేశాం. దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం- ప్రధాని మోదీ.
Aug 15, 2024, 9:14 am IST
ఢిల్లీ

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. మహిళలపై దాడులకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న మోదీ
Aug 15, 2024, 9:06 am IST
ఢిల్లీ

ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు, పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తోన్నాయి. ఇదొక సువర్ణావకాశం. సుపరిపాలన, శాంతిభద్రతలను కాపాడటానికి స్పష్టమైన విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలి: ప్రధాని మోదీ.
Aug 15, 2024, 8:49 am IST

వచ్చే అయిదు సంవత్సరాల్లో కొత్తగా 75,000 మెడికల్ సీట్లను సృష్టించబోతోన్నామని, ఫలితంగా వికసిత్ భారత్, స్వాస్త్ భారత్‌గా మారుతుందని పేర్కొన్న ప్రధాని మోదీ.
Aug 15, 2024, 8:47 am IST
గోవా

తన అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.
Aug 15, 2024, 8:45 am IST
ఢిల్లీ

రక్షణ రంగంలో స్వావలంబన, స్వయం సమృద్ధిని సాధిస్తోన్నాం. రక్షణ పరికరాల తయారీలో మనకంటూ ఓ సొంత గుర్తింపు ఉంది. రక్షణ రంగంలో తయారీ హబ్‌గా దేశం ఎదుగుతోంది: ప్రధాని మోదీ
Aug 15, 2024, 8:23 am IST
మహారాష్ట్ర

నాగ్‌పూర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.
Aug 15, 2024, 8:21 am IST
ఢిల్లీ

గత 10 సంవత్సరాల్లో 10 కోట్ల మంది మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాలలో చేరారు. వారు ఆర్థిక స్వావలంబన సాధించారు.
Aug 15, 2024, 8:12 am IST
ఢిల్లీ

భారత్‌కు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసిన మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ షహీద్
Aug 15, 2024, 7:56 am IST
ఢిల్లీ

స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
Aug 15, 2024, 7:50 am IST
ఢిల్లీ

ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం పూలు చల్లిన వైమానిక దళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు.
Aug 15, 2024, 7:32 am IST
ఢిల్లీ

78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Aug 15, 2024, 7:13 am IST
ఢిల్లీ

78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Aug 15, 2024, 7:08 am IST
ఢిల్లీ

ఎర్రకోటకు చేరుకున్న కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి.
Aug 15, 2024, 6:58 am IST
ఢిల్లీ

ఎర్రకోటకు చేరుకున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
Aug 15, 2024, 6:57 am IST
ఢిల్లీ

ఎర్రకోటకు చేరుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
Aug 15, 2024, 6:57 am IST
ఢిల్లీ

తన అధికార నివాసంలో జాతీయ పతకాన్ని ఎగురవేసిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి.
Aug 15, 2024, 6:56 am IST
ఢిల్లీ

తన అధికార నివాసంలో జాతీయ పతకాన్ని ఎగురవేసిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
Aug 15, 2024, 6:39 am IST
జమ్మూ కశ్మీర్

78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని చారిత్రాత్మక లాల్ చౌక్‌ను మువ్వన్నెల రంగులతో అలంకరించారు.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+