Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రేట్: 99మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించిన మహేష్ బాబు

తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Recommended Video

    Mahesh Babu : మహేష్ బాబు @99 : చిన్నారులకు హార్ట్ సర్జరీ | Oneindia Telugu

    హైదరాబాద్/గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు స్వస్థలం, దత్తత గ్రామం అయిన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో ఆంధ్రా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

    ప్రతీ కుటుంబానికి హెల్త్ కార్డు..

    ప్రతీ కుటుంబానికి హెల్త్ కార్డు..

    మే 8వ 2016 లో ఆ గ్రామంలోని ప్రతి కుటుంబానికి మహేష్ బాబు చేతుల మీదుగా హెల్త్ కార్డులు కూడా పంపిణీ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పలు రకాలుగా ఆ గ్రామంలోని ప్రజలకు ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేస్తూ ఆ ఊరి ప్రజల బాగోగులను చూసుకుంటున్నారు.

    ఉచితంగానే..

    ఉచితంగానే..

    ఇందులో భాగంగా చిన్నారులకు ప్రతీ నెల ఉచిత హెల్త్ చెక్ అప్స్, కొంత మంది పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు.

     99మంది పిల్లలకి విజయవంతంగా గుండె ఆపరేషన్స్..

    99మంది పిల్లలకి విజయవంతంగా గుండె ఆపరేషన్స్..

    విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ వారి నిర్వహణలో ఇప్పటివరకు హార్ట్ సర్జరీస్ కు సంబంధించి ఆరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి విజయవంతంగా 99మంది పిల్లలకు ఉచిత గుండె సంబంధిత సర్జరీలు చేశారు.

     మహేష్ ఆనందం..

    మహేష్ ఆనందం..

    ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను విజయవంతంగా 99మంది పిల్లలకు చేయడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు మహేష్ బాబు.

     మహేష్ అభినందనలు..

    మహేష్ అభినందనలు..

    అంతేగాక, ఆంధ్రా హాస్పిటల్స్ వైద్య బృందానికి మహేష్ బాబు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తూ విజయపథంలో పయనిస్తున్నారని వారిని మహేష్ ప్రశంసించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు మహేశ్ బాబుకు కృతజ్ఢతలు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+