ఏఎన్ఎంతో సహజీవనం, మహిళలలో అసభ్యంగా ప్రవర్తించిన సీఐ అరెస్ట్
ఎంతో క్రమశిక్షణగా తన విధులు నిర్వహించాల్సిన ఓ పోలీసు అధికారి రోడ్డు మీదకెక్కి రచ్చ చేసిన ఘటన కలకలం రేపింది. గుంటూరు నగరంలోని గోరంట్ల ప్రాంతంలోని శేషాద్రి అపార్ట్‌మెంట్‌లో మద్యం మత్తులో సీఐ.
గుంటూరు: ఎంతో క్రమశిక్షణగా తన విధులు నిర్వహించాల్సిన ఓ పోలీసు అధికారి రోడ్డు మీదకెక్కి రచ్చ చేసిన ఘటన కలకలం రేపింది. గుంటూరు నగరంలోని గోరంట్ల ప్రాంతంలోని శేషాద్రి అపార్ట్‌మెంట్‌లో మద్యం మత్తులో సీఐ, మహిళా ఏఎన్‌ఎమ్‌లు వీరంగం సృష్టించారు.
ఒంగోలు నేర విభాగంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న చిన్న సత్యనారాయణ, గుంటూరు జిల్లా కారంపూడిలో ఏఎన్‌ఎమ్‌గా పని చేస్తున్న పార్వతీభాయితో గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నాడు.

కాగా, గురువారం మద్యం తాగి తాను నివాసముంటోన్న అపార్ట్‌మెంట్‌లో మహిళలతో అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించాడు. ఈ ఘటనపై అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ, ఏఎన్‌ఎమ్‌లపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న వీరిద్దర్ని కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి నిందితులకు 14రోజులు రిమాండ్ విధించినట్టు మల్లపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.












Click it and Unblock the Notifications