ఉలిక్కిపడ్డ చంద్రబాబు: జూబ్లీహిల్స్ ఇంటి వరకూ కరోనా: బందోబస్తు డ్యూటీ కానిస్టేబుల్‌ పాజిటివ్

గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. వీఐపీ జోన్లు, వారి నివాసాలను ముంచెత్తే పరిస్థితికి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కొనసాగుతోన్న తాడేపల్లిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. పరిపాలనకు గుండెకాయగా భావించే సచివాలయాన్నీ విడిచిపెట్టలేదు. డజనుకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సచివాలయంలో నమోదు అయ్యాయి.

ఇక తాజాగా- హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నివాసం గుమ్మం వద్దకు చేరుకుంది ఈ వైరస్. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు సొంత ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. గుంటూరు జిల్లా బాపట్ల పోలీస్ స్టేషన్‌లో ఆయన పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా చంద్రబాబుకు చెందిన జూబ్లీహిల్స్ నివాసం వద్ద బందోబస్తు కోసం వెళ్లారు.

సాధారణంగా ప్రముఖుల నివాసాల వద్ద రొటేషన్ పద్ధతిన కానిస్టేబుళ్లు విధులను నిర్వహిస్తుంటారు. ఏపీకి చెందిన నాయకుడు కావడం వల్ల సొంత రాష్ట్రం నుంచి కూడా పోలీసు కానిస్టేబుళ్లను ఆయన ఇంటి వద్ద భద్రత కోసం కేటాయిస్తుంటారు. రొటేషన్ పద్ధతిన తన విధులను ముగించుకున్న ఆ కానిస్టేబుల్ ఈ నెల 5వ తేదీన బాపట్లకు చేరుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. కరోనా లక్షణాలు కనిపించాయి.

A Constable, who cover to Former AP CM Chandrababus residence, tests positive for Covid 19

వెంటనే ఆయనకు కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీనితో ఆయనను గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుకు తరలించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసం వద్ద బందోబస్తు విధి నిర్వహణలో ఉన్న సమయంలో తోటి కానిస్టేబుల్‌ నుంచి ఆయనకు ఈ వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో తాను వేరే ప్రాంతాలకు వెళ్లలేదని తెలిపారు.

ఈ ఉదంతంతో చంద్రబాబు, ఆయన కుటుంబం ఉలిక్కి పడుతోంది. మూడున్నర నెలలుగా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఉంటోంది. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు, మాజీమంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జూబ్లీహిల్స్ నివాసంలో ఉంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఇంటి వద్దకే డాక్టర్‌ను పిలిపించుకుని వైద్య పరీక్షలను నిర్వహించుకునే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+