శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత, ఆందోళనలో భక్తులు - టీటీడీ కీలక సూచనలు..!!
తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత హల్ చల్ చేసింది. 150వ మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించింది. దీంతో చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది మెట్ల మార్గం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. ఈ సమయంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేస్తోంది.
తిరుమల కాలిబాట మార్గంలో ఈ ఉదయం చిరుత హల్‌చల్ చేసింది. కాలిబాట మార్గంలోని 150వ మెట్టు సమీపంలో భక్తులకు చిరుత కనిపించింది. చిరుతను చూసి భయంతో భక్తులు పరుగులు తీశారు. సమీపంలోని భద్రతా సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు. చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా భద్రతా సిబ్బంది పంపిస్తున్నారు. ఓ సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మెగాఫోన్ పంపించి గోవింద నామాలు జపిస్తూ భక్తులు కొండపైకి వెళ్తున్నారు. మెగా ఫోన్ ద్వారా వచ్చే అధిక శబ్దానికి చిరుత భయపడి అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది చిరుతను గుర్తించిన ప్రాంతానికి చేరుకున్నారు. భక్తులు గుంపులుగా మాత్రమే కొండపైకి వెళ్లాలని స్పష్టం చేసారు. ఇటీవల కాలంలో అలిపిరి మార్గంలో చిరుతల సంచారం పెరిగింది. చిన్నారులపై చిరుత దాడిచేసిన ఘటనలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ ద్వారా చిరుత సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే.. భక్తులు మెట్ల మార్గంలో కొండకు చేరుకునే సమయంలో టీటీడీ అధికారులు ..అటవీ సిబ్బంది చేసిన సూచనలు పాటించాలని కోరుతున్నారు.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
అలిపిరి లగేజీ కౌంటర్ లో ఈఓ చేసిన తనిఖీల్లో.. !! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!












Click it and Unblock the Notifications