Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాపం పసివాడు.. కళ్ళెదుటే కన్నతండ్రి హత్య, రాత్రంతా అడవిలో తండ్రి శవంతోనే బాలుడు!

అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుమారుడి ఎదుటే తండ్రిని దుండగులు దారుణంగా హత్య చేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. గాంధీ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి అక్కడే మృతదేహాన్ని వదిలి వెళ్లిపోయారు.

రాత్రంతా అడవిలో తండ్రి మృతదేహం వద్ద తనయుడు

ఈ ఘటనలో అత్యంత కలచివేసే విషయం ఏమిటంటే, గాంధీతో పాటు ఉన్న అతని ఐదేళ్ల కుమారుడు సందీప్ రాత్రంతా తన తండ్రి మృతదేహం పక్కనే రోదిస్తూ గడపాల్సి వచ్చింది. చిన్నారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటన చెబుతోంది. చీకటి అటవీ ప్రాంతంలో ఒంటరిగా, భయంతో, ఆ బాలుడు గడిపిన రాత్రి అతని మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

A shocking crime in Annamayya district father murdered by assailants in front of his five-year-old son

బాలుడితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్ళిన టీచర్

ఉదయం వెలుగు పడిన తర్వాత ధైర్యం చేసిన సందీప్, అక్కడి నుంచి సుమారు ఒకున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్‌ను కలిసి తన తండ్రి చనిపోయాడని వివరించాడు. చిన్నారి చెప్పిన మాటలు విన్న టీచర్ వెంటనే అప్రమత్తమై, బాలుడితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లింది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్

అక్కడ గాంధీ మృతదేహాన్ని చూసిన అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, దుండగులు ఎవరు అనే దానిపై విచారణ కొనసాగుతోంది.

ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య.. రిటర్న్ తీసుకొస్తూ గొంతుకోసి చంపిన భర్త!
ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య.. రిటర్న్ తీసుకొస్తూ గొంతుకోసి చంపిన భర్త!

అందరినీ కలిచివేసిన చిన్నారి పరిస్థితి

ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. చిన్నారి ఎదుర్కొన్న పరిస్థితి అందరినీ కలచివేసింది. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దారుణ ఘటన మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+