AP News: ఉద్యోగం ఇప్పిస్తా.. పెళ్లి చేసుకుంటా.. సాఫ్ట్ వేర్‍ను రూ.10 లక్షలకు ముంచిన కిలాడీ లేడీ..
అతనో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. జీతం కూడా బాగానే ఉంది. ఇంకేముంది ఇంట్లో వారు అతని పెళ్లి చేశారు. కొద్ది రోజులు వారి కాపురం సక్రమంగా సాగింది. అయితే భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కలిసి ఉండలేమంటూ అతను విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న మరో పెళ్లి చేసుకోవాలని బంధువులు, తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు.
దీంతో అతను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఓ మహిళ అతనికి పరిచయం అయింది. తాను న్యాయవాదిని అంటూ అతన్ని నమ్మించింది. తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని చెప్పింది. ఆ తర్వాత ఆమె తన తండ్రితో మాట్లాడించింది. మహిళ తండ్రి తన కూతుర్ని ప్రభుత్వం ఉద్యోగం చేసేవారికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాడు.

తనకు ప్రభుత్వ ఉద్యోగం లేదని.. వచ్చే అవకాశం తక్కవేనని చెప్పాడు. అప్పుడు సదరు మహిళ కలుగజేసుకుని తనకున్న పరిచయాలతో హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది. అందుకు కాస్త డబ్బు ఖర్చు అవుతుందని చెప్పింది. దీనికి అతను ఓకే చెప్పాడు. దీంతో 2022 అక్టోబర్ లో రూ.5 లక్షలు, నవంబర్ రూ.5 లక్షలు మహిళ ఖాతాలో జమ చేశాడు.
ఆ తర్వాత ఉద్యోగం ఎప్పుడొస్తుందని అడగ్గా.. టైమ్ పడుతుందని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. చివరికి తనకు ఉద్యోగం రాదని, వారు మోసం చేస్తున్నారని తెలుసుకున్న అతను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అయితే సదరు మహిళ కొద్ది రోజుల తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే ఇంటికెళ్లి అడిగితే మహిళ తన ప్రియుడితో కలిసి బెదిరిస్తుందని అతను అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications