చవితి వేడుకల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు, మృతి (వీడియో)

అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో విషాదం నెలకొంది. ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్‌లో వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడుఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం అక్కడివారిని షాకింగ్‌కు గురిచేసింది.

వెంటనే స్నేహితులు ప్రసాద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే అప్పటికే ప్రసాద్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రసాద్‌ కుటుంబంతోపాటు స్థానికంగా విషాదం నెలకొంది.

A young man died of heart attack while dancing

వినాయక చవితి సందర్భంగా ప్రసాద్ ఇంటి ముందే స్థానికులు మండపం ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ప్రసాద్ మండపంలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రసాద్ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. హుటాహుటీన స్నేహితులు, బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

A young man died

ప్రసాద్ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోవడం దృశ్యాలను స్నేహితులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. కాగా, మృతుడు ప్రసాద్ భార్య గర్భవతి. భర్త మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరీ వల్ల కావడం లేదు. అక్కడున్నవారిని ఈ దృశ్యం కలిచివేసింది.

ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది యువకులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారిందని వైద్యులు అంటున్నారు. ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం ఉండకపోవడం లాంటి అంశాలు ఇలా ఆకస్మిక మరణాలకు దారిస్తున్నాయని చెబుతున్నారు. ఆరోగ్యం పట్ల యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+