AP News: సోషల్ మీడియాలో పరిచయం.. నగ్నంగా వీడియో కాల్.. ఆగిన పెళ్లి..!
సోషల్ మీడియాలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఉపయోగించే అమ్మాయి జాగ్రత్తతో వ్యవహరించాలి. అపరిత వ్యక్తులతో సోషల్ మీడియాలో స్నేహం చేయరాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చాలా మంది యువతులు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయం ఏర్పచుకుని నష్టపోయారు. కొందరైతే ప్రాణాలు కోల్పోయారు.
కొద్ది రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పచుకుంది. అతును తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు. తాజాగా ఓ యువతి ఓ వ్యక్తితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడడంతో ఆమె పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది.

గుడివాడకు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో కర్రా న్యూటన్ బాబు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. దీంతో వారు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఓ రోజు న్యూటన్ బాబు ఆమెను న్యూడ్ కాల్ చేయమని అడిగాడు. మొదట్లో ఆమె నిరాకరించింది. కానీ ఆ తర్వాత న్యూటన్ బాబుకు నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఆ తర్వాత కూడా వారి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి.
అయితే కొద్ది రోజుల క్రితం సదరు యువతికి ఏలూరు జిల్లా మండపల్లికి చెందిన పరంజ్యోతి అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఆ యువతి, పరంజ్యోతి ఫోన్ కాల్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆ యువతి పరంజ్యోతితో శారీరకంగా ఒక్కటయింది. వారి పెళ్లి జూన్ 14న జరగాల్సి ఉంది.. అయితే న్యూటన్ బాబు అమ్మాయి మాట్లాడిన నగ్న వీడియో కాల్ ను పరంజ్యోతికి పంపాడు. దీంతో పరంజ్యోతి పెళ్లికి నిరాకరించాడు.

అయితే యువతి న్యూడ్ వీడియో ఒకరి నుంచి ఒకరికి వెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యూటన్ బాబు, పరంజ్యోతి, అతడి తండ్రి జూషువా జ్యోతి అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సదరు మహిళ తప్పు కూడా ఉందని కొందరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications