ఘోరం: పట్టపగలు అందరూ చూస్తుండగా రేప్, వీడియో తీసి పోలీసులకు..

విశాఖపట్నం నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా అచేతనంగా పడివున్న యాచకురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Recommended Video

    పట్టపగలు అందరూ చూస్తుండగా రేప్, ఆపేవారే లేరు !

    విశాఖపట్నం: నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా అచేతనంగా పడివున్న యాచకురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతను చుట్టూ జనాభా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి పైశాచికంగా ప్రవర్తించాడు. వాహనదారుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

    స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ రైల్వేన్యూకాలనీకి చెందిన గంజి శివ(23) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతను ఫూటుగా మద్యం తాగాడు. రైల్వేన్యూకాలనీ శ్రీనివాస కల్యాణమండపం ప్రాంతంలో భిక్షాటన చేసుకునే ఓ మహిళ ఫుట్‌పాత్‌పై అచేతనంగా పడి ఉంది.

    A youth allegedly raped woman beggar in Visakhapatnam on Sunday.

    పక్కనే రహదారిపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవేమి పట్టని శివ ఆమెపై అత్యాచారం చేశాడు. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు అతన్ని నిలువరించడం మానేసి, వీడియో తీసి మొబైల్ ఫోన్ ద్వారా పోలీసులకు పంపించాడు. మరికొందరు కూడా వీడియోలు తీసుకున్నారు కానీ.. అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

    కాగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శివ పాత నేరస్థుడని, చిన్నతనం నుంచే మద్యానికి బానిసై పలు నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+