తన ప్రేమను నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని చాగలమర్రిలో సిమెంట్ ఇటుకలు తయారుచేసే చోట షమ్మ అనే 20ఏళ్ల యువతి కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది.
ఆ యువతిని ముత్యాలపాడు ప్రాంతానికి చెందిన లాల్ బాషా అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వేధిస్తుండేవాడు. సోమవారం అర్ధరాత్రి యువతి ఇంటి వద్దకు వెళ్లి ఆమెను కలిశాడు. తనను ప్రేమించాలని కోరాడు.
ఇందుకు యువతి అంగీకరించకపోవడంతో యాసిడ్ దాడి చేశాడు. దీంతో ఆమె ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడైన యువకుడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications