ఆధార్‌కార్డుంటేనే విమాన టిక్కెట్లు, మూడు విమానాశ్రయాల్లో పైలెట్ ప్రాజెక్ట్
బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలు, ఫోన్ నెంబర్లకే కాదు ఇక విమానంలో ప్రయాణం చేయాలంటే కూడ ఆధార్ కార్డు అనివార్యంగా మారనుంది. విమాన టిక్కెట్ల కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు.
విజయవాడ: బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలు, ఫోన్ నెంబర్లకే కాదు ఇక విమానంలో ప్రయాణం చేయాలంటే కూడ ఆధార్ కార్డు అనివార్యంగా మారనుంది. విమాన టిక్కెట్ల కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు. అయితే తొలుత ప్రయోగాత్మకంగా కోల్‌కతా, అహ్మదాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు.
ఆధార్ కార్డును ప్రతి దానికి అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా కానీ, ప్రభుత్వాలు ఆధార్‌ను మాత్రం ప్రతిదానికి అనుసంధానం చేయాలని నిబంధనలు విధిస్తున్నాయి.
అయితే మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేయడానికి గాను వచ్చే ఏడాది ఫిబ్రవది మాసం వరకు గడువు విధించారు. అయితే తాజాగా విమానంలో ప్రయాణించాలంటే కూడ ఆధార్‌కార్డు తప్పనిసరికానుంది.

విమానంలో ప్రయాణించాలంటే ఆధార్ తప్పనిసరి
ఆధార్ నంబర్ అనుసంధానంతో బుక్ చేసుకునే రైల్వే టికెట్ల సంఖ్యను పెంచింది. తాజాగా విమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆధార్‌ను తీసుకొస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు విమానాశ్రయాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కోల్‌కతా, అహ్మదాబాద్, విజయవాడ ప్రాంతాల్లోని విమానప్రయాణికులకు ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ఆధార్ నెంబర్ ఇస్తే చాలు
విమాన టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ నంబర్ ఇవ్వడం వల్ల విమానాశ్రయానికి వచ్చే సమయంలో ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా.. లోపలికి ప్రవేశించవచ్చు. ప్రయాణికుడు విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద టచ్ ప్యాడ్‌పై బొటనవేలు ఉంచితే.. ప్రయాణికుడు ఏ విమానానికి టికెట్ బుక్ చేసుకున్నాడో తెలిపే పూర్తి సమాచారం వస్తుందని అధికారులు ప్రకటించారు.

విమానాశ్రయాల్లో బయో మెట్రిక్
ఆధార్‌తో విమాన టిక్కెట్లను బుక్ చేసుకొనే విధానం కోసం విమానశ్రయాల్లో బయోమెట్రిక్ యాక్సెస్‌ను అందుబాటులోకి తేనున్నారు.ఈ విధానం ద్వారా ప్రయాణీకులకు సమయం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రవేశద్వారం వద్ద వేచి చూసే అవకాశం ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

బార్ కోడ్ చూపితే వివరాలు
ఐడీ కార్డులు పేపర్ టికెట్లు, బోర్డింగ్ కార్డులు చూపించడం వంటి వాటి అవసరం లేకుండా పోతోంది. విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయంలో ఈ-గేట్ వద్ద టికెట్ మీద ఉన్న బార్ కోడ్‌ను చూపితే చాలు టిక్కెట్టు కొనుగోలు చేసిన వ్యక్తి పూర్తి సమాచారం తెలుస్తోంది. టికెట్ సమాచారం, ఆధార్ సమాచారం కనిపిస్తుంది. ప్రయాణికుడి వివరాలు, బయోమెట్రిక్ సమాచారం సరిపోలిన తర్వాత ఈ-గేట్ తెరుచుకుంటుంది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications