వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ స్ఫూర్తితో ఏపీలో కొత్త పార్టీ, గ్రేటర్‌లో ఏఏపీ పోటీ చేస్తుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పార్టీ పుట్టుకు రానుంది. ఏపీలో దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆధ్వర్యంలో నవ్యాంధ్ర పార్టీ పేరిత కొత్త పార్టీ ఆవిర్భవించనుంది.

ఆ పార్టీ ఆవిర్భావానికి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు కత్తి పద్మారావు చెప్పారు. ఆయన గుంటూరు జిల్లాలోని పొన్నూరులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొత్త పార్టీ పైన ప్రకటన చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఏఏపీ పోటీ చేస్తుందా?

AAP leaders unsure of GHMC elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పంజాబ్, బీహార్ రాష్ట్రాల పైన ఉంది. అదే సమయంలో పలు రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. హైదరాబాదులోను ఉన్నారు.

ఈ నేపథ్యంలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందా అనే చర్చ సాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్ షిప్ రెండు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వేళ్లూనుకునేందుకు ప్రజా సమస్యల పైన మరింత దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ఏఏపీ పోటీ చేస్తుందా అనే చర్చ సాగుతోంది.

English summary
The Telangana leaders of Aam Aadmi Party aren’t sure about their participation in the upcoming GHMC elections and they are yet to know if they will get a nod or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X