చిలీలో మల్లి మస్తాన్ మిస్సింగ్, ఆచూకీకోసం యత్నం
హైదరాబాద్: ఏపీకి చెందిన పర్వతారోహకుడు మల్లిమస్తాన్ బాబు ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఎన్నారై, సమాచార పౌరసంబంధాల మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
చీలీ - అర్జెంటినా మధ్య యాన్డ్స్ పర్వతారోహణకు వారం రోజుల క్రితం వెళ్లిన మస్తాన్ బాబు ఆచూకి తెలియడం లేదని, చీలీ, అర్జెంటినా ఇండియన్ ఎంబసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మేరకు సమాచారాన్ని పంపించామని చెప్పారు. మస్తాన్‌బాబు ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా తీసుకుంటున్నామన్నారు.

ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మస్తాన్‌బాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కాగా, ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను 172 రోజుల్లో అధిరోహించి గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగెం మండలం గాంధీజనసంఘం గ్రామవాసి మల్లి మస్తాన్ బాబు అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications