తండ్రిని మించిన తనయ: న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో మహేష్ బాబు కూతురి యాడ్
అమరావతి/న్యూయార్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార.. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టినట్టే కనిపిస్తోంది. ఆమె నటించిన మొట్టమొదటి అడ్వర్టయిజ్‌మెంట్ లాంచ్ అయింది. అక్కడా, ఇక్కడా కాదు- ఏకంగా అమెరికా వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ వద్ద ఈ యాడ్‌ను ప్రదర్శించారు.
అరుదైన సందర్భంగా ఇది. మహేష్ బాబు అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా ఇప్పటివరకు టైమ్ స్క్వేర్ వద్ద డిస్‌ప్లే కాలేదు. ఇప్పటివరకు పలు మల్టీ నేషనల్ కార్పొరెట్ కంపెనీల అడ్వర్టయిజ్‌మెంట్స్‌లల్లో మహేష్ బాబు నటించారు. థమ్సప్, మౌంటెయిన్ డ్యూ, ప్రొవొగ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సంతూర్, అభి బస్.. వంటివి చాలా ఉన్నాయి.

సితార మాత్రం తండ్రిని మించిన తనయ అనిపించుకుంది. ఆమె నటించిన మొట్టమొదటి అడ్వర్టయిజ్‌మెంట్.. టైమ్ స్క్వేర్ వద్ద డిస్‌ప్లే అయింది. జ్యువెలరీ యాడ్‌లో తళుక్కుమంటూ మెరిసింది సితార. ప్రముఖ జ్యువెలరీ కంపెనీ పీఎంజే.. సితారను తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.అమెరికన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవ్వాళ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ఈ వాణిజ్య ప్రకటన ఆవిష్కరించిందా కంపెనీ యాజమాన్యం.
Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy
— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023
ఈ విషయాన్ని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. పీఎంజే జ్యువెలరీ కోసం సితార కలెక్షన్స్ కాన్సెప్ట్‌ను ప్రారంభించిందని చెప్పారు. లిటిల్ ప్రిన్సెస్ సితార ఘట్టమనేని నటించిన మొదటి అడ్వర్టయిజ్‌మెంట్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిందని అన్నారు. సితారకు బెస్ట్ విషెస్ తెలియజేశారు మహేష్ బాబు. చాలా గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో గుంటూరు కారం తెరకెక్కుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శ్రీలీల హీరోయిన్. జగపతి బాబు, జయరాం, ప్రకాష్ రాజ్.. ఇతర పాత్రలను పోషిస్తోన్నారు. దీని తరువాత ఎస్ఎస్ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.












Click it and Unblock the Notifications