తప్పు తెలుసుకున్న ఊర్వశి రౌతేలా
అమరావతి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ.. బ్రో. సముద్రఖని దర్శకుడు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్ ఇది. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద తెరకెక్కిన ఈ సినిమా ఇవ్వాళ విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో కామియో రోల్ చేశారు బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలా. చిత్రమంజరి క్యారెక్టర్‌లో నటించారు. మైడియర్ మార్కండేయ పాటలో తళుక్కుమంటూ మెరిశారు. ఈ ఒక్క పాట కోసం భారీగా రెమ్యునరేషన్ చెల్లించారు నిర్మాత. ట్రాక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ పాట జనం నోళ్లల్లో నానుతోంది.

శిల్పారామంలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఊర్వశి రౌతెలా అటెండ్ అయ్యారు. స్టేజ్ మీద పెద్దగా మాట్లాడలేదు గానీ.. ఆ తరువాతే ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. ఆమెను ట్రోల్ చేస్తోన్నారు.
దీనికి కారణం లేకపోలేదు. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా సంబోధించారామె. ఈ మేరకు ఆయనకు బెస్ట్ విషెస్ చెబుతూ ఈ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఆయనను ఆకాశానికెత్తేశారు.
పవన్ కల్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా సంబోధించడం.. వైఎస్ జగన్, వైసీపీ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై ఆమెను చెడుగుడు ఆడుకుంటున్నారు. గతంలో లెజెండ్ తమిళ సినిమా చేసినప్పుడు కూడా హీరో అరుళ్ శరవణన్‌ను కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి అంటూ పొగిడారామె. ఈ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోన్నారు.
Delighted to share screen space with the esteemed @PawanKalyan garu in our film #BroTheAvatar 🎥 🍿 releases tomorrow #28thJuly worldwide 🌎 story about an arrogant person who is given a second chance to fix his mistakes after death. See you all ♥️ @IamSaiDharamTej… pic.twitter.com/Kkwceakf7N
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) July 28, 2023
దీని తరువాత ఆమె తన తప్పు తెలుసుకున్నారు. దాన్ని సరి చేసుకున్నారు. తాజాగా మళ్లీ ఈ సాయంత్రం మరో ట్వీట్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ పేరు ముందు ఎలాంటి డిజిగ్నేషన్‌ను ఆమె మెన్షన్ చేయలేదు. గురువారం చేసిన ట్వీట్‌లోనే సవరణలు చేశారు. పాత ట్వీట్‌లో పవన్ కల్యాణ్ పేరుకు ముందు రాసిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే లైన్‌ను తొలగించారు.
-
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్!












Click it and Unblock the Notifications