Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గడ్డి తినను: ఆదినారాయణ, వైసిపికి నేనే చిల్లు పెట్టా: జలీల్

విజయవాడ: ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పదవుల కోసం గడ్డి తినే రకం కాదన్నారు. తాను పార్టీ మారడానికి ఏం జలీల్ ఖాన్‌ను కాదని ఎద్దేవా చేశారు.

తన రాజకీయ భవిష్యత్తు గురించి జలీల్ ఖాన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదవుల కోసం తాను పార్టీ మారేది లేదని చెప్పారు. క్లిష్ట సమయంలోనే మన గుణం (క్యారెక్టర్) ఏమిటో బయటపడుతుందని చెప్పారు. తాను జగన్ వెంటే ఉంటానని చెప్పారు. కాగా, త్వరలో శ్రీకాంత్ రెడ్డి సైకిల్ ఎక్కుతారని జలీల్ ఖాన్ అన్నారు. దీనిపై శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

Adinarayana Reddy condemns Zaleel Khan statement

నేను చిల్లు పెట్టాను: జలీల్ ఖాన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే కుండకు చిల్లు పెట్టింది తానే అని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. తన బోణీ బాగుందని సీఎం చంద్రబాబు ప్రశంసించారని చెప్పారు. వైసిపి నుంచి మరో నలభై మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రానున్నారని జోస్యం చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన చెద్దామంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశారన్నారు. కాగా, ఇప్పటి దాకా వైసిపీ నుంచి పదిహేను, పదహారు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+