Kasturi: తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలపై కస్తూరి సారీ- ఏమన్నారంటే ?
తెలుగు వారిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటి కస్తూరి ఇవాళ వెనక్కి తగ్గారు. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న వారు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. చరిత్ర తెలియకుండా కస్తూరి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీంతో ముందు వాటిని సమర్ధించుకునే ప్రయత్నం చేసిన కస్తూరి.. ఇవాళ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
తెలుగువారిపై వివాదస్పద వ్యాఖ్యలపై స్పందించిన సినీనటి కస్తూరి నా తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం నా ఉద్దేశం కాదంటూ వివరణ ఇచ్చారు. మీ మనసును బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అన్నారు. రెండు రోజులుగా తనకు చాలా బెదిరింపులు వచ్చాయని, తాను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని కస్తూరి వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది.

తాజాగా చెన్నెలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కస్తూరి.. గతంలో రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని, ఇప్పుడు అలా వచ్చిన వారంతా తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పిన చెప్పడానికి మీరెవరంటూ ద్రవిడ వాదుల్ని కస్తూరి ప్రశ్నించారు. దీనిపై వివాదం చెలరేగింది. చివరకు ఆమె వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications