గజల్ శ్రీనివాస్ రీ ఎంట్రీ-డిప్యూటీ సీఎం ఆళ్లనానితో భేటీ-ఆ ప్రోగ్రామ్ కు ఆహ్వానం
ప్రముఖ సినీ గాయకుడు, కేశిరాజు శ్రీనివాస్ (గజల్ శ్రీనివాస్) రీ ఎంట్రీ ఇచ్చారు. గతంలో లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకుని చాలా రోజుల పాటు అజ్ఞాతంలో ఉండిపోయిన గజల్ శ్రీనివాస్ తాజాగా ఏలూరులోని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని క్యాంపు కార్యాలయంలో దర్శనమిచ్చారు. గతంలో గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల వీడియోలు లీక్ రావడంతో కొంతకాలం వివాదం రేగింది. ఆ తర్వాత గజల్ తిరిగి ఇప్పుడు దర్శనమిచ్చారు.
వచ్చే ఏడాది జనవరి 7, 8 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని వెస్ట్ బెర్రీ హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో "అంతర్జాతీయ తెలుగు సంబరాలు" జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనాలని డిప్యూటీ ఆళ్ల నానిని గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు. ప్రాచీన తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రశంసించబడి, ప్రపంచవ్యాప్తంగా రెండవ ఉత్తమ లిపిగా గుర్తించబడి ఎన్నో అపురూపమైన అష్టావధానము, శతావధానము, అనవద్యమైన పద్య విద్యా వంటి సాహితీ ప్రక్రియల్లో అత్యంత పేరెన్నికగన్న చక్రవర్తులచే, కవిశేఖరలచే పండిత పరమేశ్వరలచే చేయి తిరిగిన రచయితల ప్రశంసించబడుచున్నదని, ఆంధ్రభాష, అద్భుతమైన చరిత్ర కలిగి గొప్ప వారసత్వ సంపదతో ఆశీర్వదించబడిన తెలుగు ఆంధ్ర భాషగా ప్రాముఖ్యతను సంతరించుకుందని, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాల ద్వారా తెలుగు సంస్కృతి వికాసానికి ప్రగతికి ప్రాచీన తెలుగు భాష యొక్క గుర్తింపు మరియు వారసత్వాన్ని ప్రోత్సహించి తెలుగుభాష యొక్క గౌరవాన్ని నిలబెట్టే దిశగా "ఆంధ్ర సారస్వత పరిషత్" పనిచేస్తుందని మంత్రి ఆళ్ల నాని కి గజల్ శ్రీనివాస్ వివరించారు.

భీమవరం నగరంలో నిర్వహించబోయే "అంతర్జాతీయ తెలుగు సంబరాలకు" కావలసిన సహకారాన్ని అందిస్తామని ఆళ్ల నాని గజల్ శ్రీనివాస్ కు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. తెలుగు సంస్కృతి వికాసానికి ప్రగతికి ప్రాచీన తెలుగు భాష యొక్క గుర్తింపు మరియు వారసత్వాన్ని ప్రోత్సహించే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ ను మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా "ఆంధ్రవాజ్మయ వైజయంతి" అనే ప్రత్యేక సంచిక తెలుగులోని వివిధ ప్రక్రియల పై ప్రసిద్ధి వ్యాసాలు మరియు ప్రముఖుల సాహిత్యాలు మల్టీకలర్ లో 400 పుటల ప్రత్యేక సూచికను తెలుగు సంబరాల కార్యక్రమంలో విస్తరించబడుతుందని మంత్రి ఆళ్ల నానికి ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు..
Recommended Video













Click it and Unblock the Notifications