వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనివ్వకుండా బ్యారికేడ్లు సైతం అడ్డుగా కట్టారు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలోనూ మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే తమ పార్టీ అభ్యర్థులను టీడీపీ కూటమి నాయకులు అడ్డుకుంటోన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్‌ పత్రాలను చించివేయడం, మహిళలపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను కాపాడుతూ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

After ZPTC and MPTC Nomination Obstruction YSRCP Seeks State Election Commissioner s Intervention

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు వేయడానికి కడపలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో వెళ్తోన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. నామినేషన్లు వేయడానికి కార్యాలయాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన మహిళా అభ్యర్థుల చేతుల్లోని పత్రాలను లాక్కొని చించివేస్తున్నారని గుర్తు చేశారు. మదనపల్లిలో బారికేడ్లు సైతం ఏర్పాటు చేసి ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ వేయలేని పరిస్థితి కల్పించారని ఆరోపించారు.

59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ
59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ

అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, పల్నాడు జిల్లాల్లోనూ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు. ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నాని చెప్పారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా కళ్లు తెరిచి, స్వేచ్ఛగా నామినేషన్లు వేసే వాతావరణం కల్పించాలని కోరారు.

నామినేషన్ల గడువు పెంపు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు
నామినేషన్ల గడువు పెంపు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు

సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ నిష్పక్షపాతంగా అమలు చేయాలని, మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన పోలీసు, రెవెన్యూ అధికారులను రానున్న ఎన్నికల విధుల నుంచి తప్పించాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు తుది జాబితా ప్రకటించకుండా నిలిపివేయాలన్న ఆదేశాలను కూడా పాటించాలని, సుప్రీంకోర్టు తీర్పును తమకు అనుకూలంగా వక్రీకరించి ప్రచారం చేస్తున్న టీడీపీ తీరును గమనించాలని అన్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల విషయంలోనూ ఎన్నికల సంఘం న్యాయం చేయకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన తేల్చి చెప్పారు. చట్టాన్ని పక్కనపెట్టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసు, రెవెన్యూ అధికారులపై న్యాయపోరాటం చేస్తామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనలపై చట్టానికి, న్యాయానికి లోబడి నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+