బెంగళూరు టు కడప విమాన సర్వీసులు
బెంగళూరు: బెంగళూరు నగరం నుండి ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరానికి ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసులు నడపడానికి అన్ని సిద్దం చేసింది. ప్రతి రోజు ఒక విమానం బెంగళూరు నుండి కడపకు వెళ్లి మళ్లీ బెంగళూరు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.
జూన్ 7వ తేది నుండి బెంగళూరు-కడప నగరాల మధ్య విమాన సర్వీసులు సంచరిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జూన్ 7వ తేది ఉదయం 10.40 గంటలకు ఎయిర్ పెగాసస్ విమానం కడపకు బయలుదేరి వెలుతుంది.

ప్రతి రోజు ఉదయం 10.40 గంటలకు బెంగళూరు నుండి విమానం బయలుదేరుతుంది. ఉదయం 11.30 గంటలకు కడపకు చేరుకుంటుంది. ఉదయం 11.50 గంటలకు కడప నుండి విమానం బెంగళూరు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.35 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
2015 ఏప్రిల్ నెలలో ఎయిర్ పెగాసస్ బెంగళూరు నుండి హుబ్బళికి విమాన సర్వీసులు ప్రారంభించింది. అదే విధంగా బెంగళూరు నుండి తిరువనంతపురంకు విమాన సర్వీసులు నడిపింది. టిక్కెట్ ధర రూ. 1,600 నిర్ణయించారు.
త్వరలో బెంగళూరులోకి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి, బెల్గాం, కోచ్చి, చెన్నయ్, పాండిచ్చేరిలకు విమాన సేవలు ప్రారంభిస్తామని ఎయిర్ పెగాసస్ ప్రతినిధులు అంటున్నారు.












Click it and Unblock the Notifications