ఒప్పందం తప్పనిసరి, ఇవ్వొద్దు: అఖిలప్రియ ఆగ్రహం, బోటు ప్రమాదంపై కలెక్టర్ నివేదిక

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రయివేటు బోటు ఆపరేటర్ల పైన పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ మంగళవారంతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బోటు ఆపరేటర్లు, సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

బోటు ప్రమాదం: పబ్లిసిటీ పిచ్చి, అఖిలప్రియను టార్గెట్ చేసిన జగన్ పార్టీ

ఈ సందర్భంగా సమావేశానికి కొంతమంది ఆపరేటర్లు హాజరు కాలేదు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, హాజరు కానీ బోటు యజమానులకు మరోసారి లైసెన్సులు ఇవ్వవద్దని, భవిష్యత్తులో వారికి ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు.

 లైఫ్ జాకెట్లు ఇస్తున్నా ఎందుకు అందించట్లేదు

లైఫ్ జాకెట్లు ఇస్తున్నా ఎందుకు అందించట్లేదు

అలాగే, అధికారులను ప్రాంతాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి అఖిలప్రియ. లైఫ్ జాకెట్లను టూరిజం శాఖ సరఫరా చేస్తున్నా బోటు ప్రయాణీకులకు ఎందుకు అందించడం లేదని నిలదీశారు.

అందరూ టూరిజం శాఖతో ఒప్పందం చేసుకోవాల్సిందే

అందరూ టూరిజం శాఖతో ఒప్పందం చేసుకోవాల్సిందే

అలాగే బోటు ఆపరేటర్లు అందరూ టూరిజం శాఖతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని అఖిలప్రియ తేల్చి చెప్పారు. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన అనుమతితో విహార యాత్రలకు బోట్లను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 బోటు ప్రమాదంపై నివేదిక

బోటు ప్రమాదంపై నివేదిక

బోటు ప్రమాదంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి మంగళవారం నివేదిక అందించారు. పరిమితిని మించి ప్రయాణీకులను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. బోటు నడిపిన వ్యక్తికి దీనిని నడిపేందుకు లైసెన్స్ లేదని చెప్పారు.

మలుపు తిప్పడంతో అదుపు తప్పి తిరగబడిన బోటు

మలుపు తిప్పడంతో అదుపు తప్పి తిరగబడిన బోటు

నీటి భద్రతా సమావేశాలను నిర్వహించాలని నివేదికలో కలెక్టర్ సూచించారు. బోటును ఒక్కసారిగా మలుపు తిప్పడంతో అది అదుపుతప్పి తిరగబడిందని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. బోటింగ్ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Tourism Minister AKhila Priya fired at private boat operator on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి