వదిలి పెట్టేది లేదు, మగోళ్లం అన్నాడుగా పారిపోయాడేం: అఖిలప్రియ
నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత శిల్పా సోదరులు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు కనిపించడం లేదని మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ అన్నారు.
నంద్యాల: నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత శిల్పా సోదరులు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు కనిపించడం లేదని మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ అన్నారు.

అప్పుడు, ఇప్పుడు పారిపోయారు
నంద్యాలలో అప్పుడు తన తండ్రి భూమా నాగిరెడ్డి గెలిచిన తర్వాత కూడా ఇలాగే కనిపించకుండా పారిపోయారని అఖిలప్రియ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తన సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచిన అనంతరం కూడా వారు కనిపించడం లేదన్నారు.

శిల్పాను వదిలిపెట్టను
నంద్యాలలో టిడిపి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి చెప్పారని, కానీ ఫలితాల అనంతరం ఆయన తప్పించుకు తిరుగుతున్నారని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. రాజకీయ సన్యాసం చేస్తానని శిల్పా చెప్పే వరకు తాను వదిలిపెట్టేది లేదన్నారు.

మగోళ్లం అన్నాడుగా.. ఎక్కడకు పారిపోయారు
శిల్పా సహకార్, శిల్పా బ్యాంక్ లాంటివి ప్రజలను మభ్య పెట్టడానికే తప్ప అవి ప్రజలకు ఉపయోగపడేది ఏదీ లేదని మంత్రి అఖిలప్రియ అన్నారు. నంద్యాలలో గెలిస్తే మగాళ్లం, ఓడితే ఆడోళ్లమని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆయన ఎక్కడకు పారిపోయారని ఎద్దేవా చేశారు.

గెలుపు తర్వాత..
కాగా, ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి టిడిపి నేత భూమా బ్రహ్మానంద రెడ్డి 27వేలకు పై చిలుకు ఓట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శిల్పా సోదరులు నంద్యాలలో కనిపించడం లేదని అఖిలప్రియ అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications