అలీకి జగన్ మరో షాక్

నటులు అలీకి జగన్ మరో షాకిచ్చారా అంటే అవననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారాయన. ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో జగన్ అలీకి టికెట్ కేటాయించలేకపోయారు. టికెట్ దక్కకపోయినప్పటికీ పార్టీ తరుఫున అలీ ప్రచారం నిర్వహించారు. అలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయిన తరువాత అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది.

జగన్ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టుతో సరిపెట్టారు. అయినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా పార్టీ బలోపేతం కోసం విసృతంగా కృషి చేస్తున్నారాయన. ప్రస్తుతానికి అయితే అలీ వైసీపీలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. సామాజిక సాధికార యాత్రలో జగన్ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు గురించి ప్రజలకు తెలియజేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా అనుకున్నారంతా.

Ali s name was not in the campaign committee from YCP

నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాలకు అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. రాజ్యసభ పదవిపై ఉన్న ఆశలు కూడా నిర్వీర్యం అయ్యాయి. మైనారిటీ కోటాలో వచ్చే రాజ్యసభ సీటును కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ పాషాకు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కర్నూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ పాషా కొన్ని కారణాల వల్ల సీటు కేటాయించలేకపోయానని...రెండేళ్ల తర్వాత హఫీజ్‌ పాషాను రాజ్యసభకు పంపుతానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

హఫీజ్‌ పాషాకు జగన్ హామీ ఇవ్వడంతో అలీ సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వైసీపీ తాజాగా ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అలీ పేరు లేకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీలో ఆయన కథ ముగిసినట్టే అని చర్చ తెర మీదకు వస్తోంది. అలీ పేరు ప్రచార కమిటీలో లేకపోవడంతో ఆయన వైసీపీకి దూరం అయినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరీ అలీ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+