ఎమ్మెల్యే చింతమనేనిని వెంటనే అరెస్టు చేయకపోతే మరో ఉద్యమం...అఖిలపక్షం హెచ్చరిక
పశ్చిమ గోదావరి:హమాలీ కార్మికుడిపై దాడి చేసి కులం పేరిట దూషించిన కేసులో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయకపోవడం పట్ల అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆదివారం ఏలూరు ఇఫ్టూ కార్యాలయంలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో చింతమనేని అరెస్ట్ కోసం డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్దం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ చింతమనేని అరెస్టు కోసం మరో ఉద్యమానికి అఖిలపక్షం శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

హమాలీ కార్మికుడు రాచీటి జాన్‌పై దాడిచేసి కులం పేరుతో దూషించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అఖిలపక్షం నేతలు మండిపడ్డారు.
ఆదివారం ఏలూరు ఇఫ్టూ కార్యాలయంలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, సీపీఎం సీపీఐ, ఎంసీపీయూ, ఏఐటీఆర్‌ఎఫ్ నాయకులు, పౌరహక్కుల సంఘం నేతలతో పాటు బాధితుడు రాచీటి జాన్, ఇఫ్టూ నగర కార్యదర్శి బద్దా వెంకటేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు.
చింతమనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా ఇంతవరకు ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 23వ తేదీ లోగా చింతమనేనిని అరెస్టు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పారు.
ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ...ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు పెచ్చుమీరిపోయాయని...అతడికి చట్టాలు వర్తించవా?...చింతమనేనిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని... ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా చింతమనేనిపై పోలీసులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications