టీడీపీ గెలుపు కష్టమే..పెద్ద మైనస్‌ అదే

ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న జగన్ పార్టీ , కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతతో మెలిగింది. అయితే టీడీపీ, జనసేన కూటమిలో ఇప్పుడు బీజేపీ కూడా చేరడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుదీర్ఘకాలంపాటు సాగుతూ వచ్చిన కూటమి పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. దీంతో సీఎం జగన్‌ను ఢీ కొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూటమి కచ్చింతంగా అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి.

బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి పెద్ద నష్టమే వాటిల్లే పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీకి టీడీపీ ఆఫర్ చేసిన సీట్లే దీనికి కారణంగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీకి ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించడాన్ని టీడీపీ సీనియర్ నాయకులు సైతం తప్పుపడుతున్నారు. 2014 ఎన్నికల పరిస్థితి వేరు. ఇప్పుడున్న పరిస్థితి వేరు. కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాబట్టి కేంద్ర సహాయక సహకారాలు ఉండాలి అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని అప్పట్లో చంద్రబాబు చెప్పారు.

alliance with BJP going to be minus for Chandrababu

కానీ 2017లో ఇదే చంద్రబాబు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసి కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అది కూడా ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి హామీ లేకుండానే పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే అంశంగా కనిపిస్తోంది. కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని తెలుగు తమ్ముళ్లు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు ఓటు శాతం పెరిగిన జనసేనకు తక్కువ సీట్లు కేటాయించి.. అసలు ఓటింగ్ పర్సెంట్ లేని బీజేపీ అధిక స్థానాలను కేటాయించడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

alliance with BJP going to be minus for Chandrababu

దీనిపై బహిరంగంగానే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు 2014 ఎన్నికల మాదిరిగా పోటీ చేయకుండా నేరుగా కూటమికి మద్దతు ఇచ్చిన బాగుండని సెటైర్లు వేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో కూటమిలో ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా అనే అనుమానం అన్నీ పార్టీలోనూ నెలకొంది. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వస్తే అది కచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+