వాళ్లను జైలుకు పంపించా: అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
ఈనెల 11వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రి రిలీజ్ వేడుక శిల్పకళా వేదికలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అరవింద్ మాట్లాడారు.
చిరంజీవి అంటే తనకు ఉన్నటువంటి ఇష్టం, అభిమానం గురించి అల్లు అరవింద్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. అయినా చిరంజీవి చూడని సక్సెస్ ఏమీ లేదని, ఆయనకు మనం ఆల్ ద బెస్ట్ చెప్పే పని కూడా లేదన్నారు.

అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా చిరంజీవి నటించిన సినిమాలను చూస్తూ ఆయనకు అభిమానులుగా మారిపోయారని, తాను మాత్రం ఆయనతో సినిమాలు చేస్తూ అభిమానిగా మారిపోయానన్నారు. చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానం ఉందనే విషయం గురించి మీకు చెప్పాలి అంటూ అల్లు అరవింద్.. జీవిత-రాజశేఖర్ గురించి వెల్లడించారు.
చిరంజీవి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారన్నారు. అయితే ఈయన చేస్తున్న కార్యక్రమాల గురించి కొందరు నీచంగా మాట్డారని, వారిపై చర్యలు తీసుకోవడానికి, వారిని జైలుకు పంపించడానికి తాను 12 సంవత్సరాల పాటు పోరాడానని చెప్పారు. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన చెప్పింది జీవిత-రాజశేఖర్ గురించే చెప్పారంటూ కామెంట్స్ పెడుతున్నారు. భోళాశంకర్ లో తమన్నా కథానాయికగా నటించింది. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో, సుశాంత్ కీలక పాత్రలో నటించారు.












Click it and Unblock the Notifications