వరుణ్-లావణ్య త్రిపాఠి రిలేషన్‌పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్.. నిజమేనా..??

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరి ప్రేమ గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ప్రచారంలో ఉందికానీ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఏకంగా ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మొదటి సినిమా సమయంలో మంచి తెలుగబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలంటూ అల్లు అరవింద్ సలహా ఇచ్చిన వీడియో వెరలైంది.

తాజాగా ఈ వీడియోమీద అల్లు అరవింద్ స్పందించారు. తాజాగా జరిగిన 'బేబీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య పై ఫన్నీ కామెంట్స్ చేశారు. కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన యాంకర్ అల్లు అరవింద్ ను హీరోయిన్ పాత్ర గురించి చెప్పాలని కోరింది. ఈ సినిమాను స్ఫూర్తి గా తీసుకొని పెళ్లి చేసుకోవద్దు అంటూ వైష్ణవి చైతన్య కు సలహా ఇచ్చారు. వైష్ణవికి ఇంకా మంచి భవిష్యత్ ఉందని, కెరీర్ లో సెటిలైన తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేయాలని సూచించారు.

alluaravindlavanyavaruntejmarriage

తన బ్యానర్ లో ఓ హీరోయిన్ మూడు సినిమాలు చేసిందని, ఆ అమ్మాయిని ఇక్కడే మంచి తెలుగబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తే మా వాడినే లవ్ చేసిందన్నారు. వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జులై 14 న బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు.

ఠాగూర్ సినిమా నిర్మాత మధుతో కలిసి రామాయణం చిత్రం తీయాలనే యోచనలో అల్లు అరవింద్ ఉన్నారు. మూడు నిర్మాణ సంస్థలు ఈ చిత్రంలో భాగస్వాములయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+