పవన్ కల్యాణ్‌పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజకీయ మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు అండగా నిలిచారు. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్ పవన్‌కు మద్దతు తెలిపారు.ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌పెట్టారు.పవన్‌కల్యాణ్‌ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా.

ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్‌లు రిలీజ్ చేశారు. తేజా సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు తెలిపారు. నిర్మాత నాగవంశీ ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి సైతం పవన్‌కు జై కొట్టారు.
My heartfelt wishes to @PawanKalyan garu on your election journey. I have always been immensely proud of the path you've chosen, dedicating your life to service. As a family member, my love and support will always be with you. My best wishes for achieving all that you aspire for.
— Allu Arjun (@alluarjun) May 9, 2024












Click it and Unblock the Notifications