పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు తలకిందులుగా తపస్సు చేస్తున్న అల్లు అర్జున్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తన చిన మామయ్య అయిన పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ను కలిసేందుకు అనుమతి కావాలంటూ ఆయన వ్యక్తిగత సిబ్బందిని కోరారు. అయితే ఇంకా అనుమతి మాత్రం రాలేదు. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం.. మహిళ మృతిచెందడం.. ఆమె కుమారుడు బ్రెయిన్ డెత్ కావడం.. బన్నీ జైలుకు వెళ్లడం.. మధ్యంతర బెయిల్ పై బయటకు రావడం చకచకా జరిగిపోయాయి. విడుదలైన తర్వాత తన విడుదలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు బన్నీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ గంట సమయం గడిపి నాగబాబు ఇంటికి వెళ్లారు.
వ్యక్తిగతంగా కలిసి థాంక్స్ చెప్పాలని..
పవన్ కల్యాణ్ ను మాత్రం కలవలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని పవన్ కల్యాణ్ హైదరాబాద్ వస్తారని అనుకున్నారుకానీ అలా జరగలేదు. సాయంత్రానికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రావాలన్న ఆలోచన పవన్ విరమించుకొనివుంటారని బన్నీ అభిమానులు భావించారు. అయితే పవన్ కల్యాణ్ కు పుష్ప2 ప్రీ రీలీజ్ ఈవెంట్ సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చారని బన్నీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే వ్యక్తిగతంగా కలిసి థాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. అందుకే పవన్ సిబ్బందిని అపాయింట్ మెంట్ కోరారు. అనుమతి వస్తుందా? రాదా? అనేది చూడాలి.

జీవన్మరణ సమస్యల్లా అసెంబ్లీ ఎన్నికలు
వాస్తవానికి పవన్ కల్యాణ్ కు ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యల్లాంటివి. ఎన్నో అవమానాలను తట్టుకుంటూ, వైసీపీ నుంచి వస్తున్న తీవ్ర విమర్శలను కాచుకుంటూ ఆయన పిఠాపురం బరిలో నిలబడ్డారు. పవన్ కు మద్దతుగా పరిశ్రమలో ఉన్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు పిఠాపురంలో ప్రచారం చేశారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ప్రచారం చేశారు. ఇంటింటికీ అందరూ తిరిగారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రచారం చేసేందుకు స్వయంగా నంద్యాల వెళ్లారు. ఈ సంఘటన పవన్ కల్యాణ్ ను తీవ్రంగా బాధించింది. ఆ సమయంలో మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగింది. ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యాక ఆ దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను కలిసి బహుశా బెయిల్ విషయం మాట్లాడతారేమోనని, మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలనే విషయంపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications