అల్లు అర్జున్‌కు షాక్: వెలి వేసిన మెగా కుటుంబం
Allu Arjun: ఏపీ, తెలంగాణల్లో అత్యంత కీలకమైన ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదే సమయంలో తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 76.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా తెలంగాణలో 64.93 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఏపీలో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొనగా.. తెలంగాణలో సజావుగా కొనసాగిందీ ఓటింగ్ ప్రక్రియ.

ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్.. ఒక వైపు- మిగిలిన మెగా కుటుంబం అంతా మరోవైపు నిలిచాయి. తనకు అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశారు.
పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ- ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. ఓ ట్వీట్ పోస్ట్ పెట్టి వదిలేశారు. అదే సమయంలో రామ్ చరణ్, తన తల్లి సురేఖతో కలిసి ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లారు. కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు.
ఈ పరిణామం మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ పిలుపునివ్వడం, సాయి ధరం తేజ్ వంటి మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారానికి వెళ్లిన పరిస్థితుల్లో వారిని కాదని అల్లు అర్జున్.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లడం ఆ కుటుంబంలో కలకలం రేపింది.
దీనితో అల్లు అర్జున్‌ను దూరం పెట్టాలని నిర్ణయించుకుంది మెగా ఫ్యామిలీ. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని నాగబాబు ట్వీట్ పెట్టారు.
తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడేనంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ గురించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ.. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం పని చేసిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications