కొత్త వివాదానికి కారణమవుతున్న 'బావ'?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' పానిండియా స్థాయిలో హిట్ అవడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో ఉన్నవారి నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. 'పుష్ప2' నుంచి అల్లు అర్జున్ అభిమానులకు కూడా రెండు ట్రీట్లు కూడా ఇవ్వడంతో వారు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ తరుణంలోనే ఒక విషయం వివాదానికి దారితీస్తోంది. అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తనకు శుభాకాంక్షలు చెప్పినవారందరికీ తిరిగి అల్లు అర్జున్ విషెస్ చెప్పారు.
చిరంజీవి, రామ్ చరణ్ ఎన్టీఆర్ కంటే ముందుగా విషెస్ తెలిపారు. అయితే రిప్లై ఇచ్చేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ముందిచ్చాడు. 'హ్యాపీ బర్త్ డే బావా' అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కు 'థాంక్స్ బావా.. నీకు నా హగ్గులు' అని అర్థం వచ్చేలా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 'ఓన్లీ హగ్సేనా? పార్టీ లేదా పుష్పా?' అని కామెంట్ చేయగా 'వస్తున్నా' అని ఎన్టీఆర్ దగ్గరకు బయలుదేరుతున్నట్లు ట్వీట్ చేశాడు.

అల్లు అర్జున్ ముందుగానే చిరంజీవికి, రామ్ చరణ్ కు రిప్లై ఇస్తే బాగుండేదని, వారిద్దరికంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువయ్యాడా? అంటూ మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ కు థాంక్స్ బ్రదర్ అని అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. బావ అనేపదం ఎందుకు రాలేదని మెగా అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ కు రామ్ చరణ్ బావ అవుతాడు. అయినా ట్వీట్ లో బ్రదర్ అని పేర్కొన్నాడు. చిరంజీవి కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య ఏదో జరుగుతోందంటూ పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే చిరంజీవి, అల్లు అరవింద్ మాములుగానే ఉంటుండుటంతో రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు మధ్య తెలియనిది ఏదో జరిగిందనే చర్చ నడుస్తోంది. మొత్తానికి బావ అన్న పదం కొత్త చిచ్చు పెట్టేలా ఉందనే కామెంట్లు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications