హైదరాబాద్ టూ విజయవాడ రోడ్ ఫుల్ రష్, ప్రత్యామ్నాయ మార్గాలు ప్రకటన..!!
సంక్రాంతి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తున్న వారితో రహదారులు కిటకిట లాడుతున్నాయి. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కదలటానికి చాలా సమయం పడుతోంది. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి సహకారం అందిస్తున్నారు.
సంక్రాంతి సెలవుల వేళ రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతు న్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు పెద్దఎత్తున బారులు తీరాయి. దీంతో, అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. హైదరాబాద్ మీదుగా గుంటూరు, ఖమ్మం, విజయవాడ వెళ్లే వాహనాలు, ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కో కుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ టు విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చౌటుప్పల్ దగ్గర నారాయణపురం రోడ్డును మూసివేశారు. ఇదే సమయంలో రద్దీ తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ హైవేకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు.. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. అదే విధంగా ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు.. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకుంటే.. ట్రాఫిక్ సమస్య లేకుండానే గమ్య స్థానాలకు చేరుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక.. భువనగిరి వైపు వెళ్లేందుకు ORR పైనుంచి ఘట్‌కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి వెళ్లాలని చెబుతున్నారు. కాగా, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా భువనగిరి చేరుకోవచ్చని సూచిస్తున్నారు. చౌటుప్పల్ దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకోకుండా.. ఈ ప్రత్యామ్నాయ మార్గాలను వెళ్లటం ద్వారా నిరీక్షణ తప్పదని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications