చిరంజీవి చెబితే సీఎం జగన్ "తగ్గుతారా"- అమరావతికి మెగాస్టార్ : కోల్డ్ వార్ - అక్కడే అసలు ట్విస్ట్..!!

ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ మధ్య పరోక్ష యుద్దం సాగుతోందా. తెలంగాణలో టిక్కెట్ల ధరలు పెంచినా ఏపీలో ఎందుకు పెంచటం లేదు. ఏపీలో ఎప్పుడూ లేనంతగా భారీ స్థాయిలో థియేటర్లలో సోదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతన్నాయి. టాలీవుడ్ నుంచి ప్రభుత్వంతో చర్చించేదెవరు. టాలీవుడ్ లో దాసరి నారాయణ తరహాలో పెద్దన్న పాత్ర పోషించేదెవరు. ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం అన్ని జల్లాల్లోనూ సినిమా థియేటర్లలో సోదాలు చేస్తోంది. అనేక థియేటర్లు సీజ్ చేసింది. పలువురు యజమానులకు నోటీసులు జారీ చేసింది. జరిమానాలు విధించింది.

టిక్కెట్ల ధరలు..థియేటర్లలో సోదాలు

టిక్కెట్ల ధరలు..థియేటర్లలో సోదాలు


మరి కొందరు థియేటర్ల యజమానులు స్వచ్చందంగా తమ సినిమా థియేటర్లను మూసేస్తున్నారు. ఇక, మరి కొద్ది రోజుల్లో భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే మూడు కొత్త సినిమాలు నడుస్తున్నాయి. కానీ, పేరున్న మల్టీ ప్లెక్స్ లు సైతం తాము ఈ ధరలతో థియేటర్లు నిర్వహించలేని క్లోజ్ చేస్తున్నారు. ఇక, టాలీవుడ్ ప్రముఖుల పైన ఒత్తిడి పెరిగింది. ఈ విషయంలో నేరుగా సీఎం జగన్ తో చర్చలు చేస్తేనే ఫలితం ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. దీంతో..మెగాస్టార్ చిరంజీవి పైన దర్శక- నిర్మాతలు ఒత్తిడి మొదలు పెట్టారు. గతంలోనూ సినిమా పరిశ్రమ సమస్యల పైన చిరంజీవి లీడ్ తీసుకొని సీఎం వద్దకు టీం తీసుకెళ్లారు.

సీఎంతోనే నేరుగా చర్చించాలంటూ

సీఎంతోనే నేరుగా చర్చించాలంటూ

కానీ, కొంత కాలంగా సీఎం నిర్ణయాలపైన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తి చేస్తున్న చిరంజీవి నేరుగా మాత్రం మాట్లాడలేదు. మంత్రి పేర్ని నానితో ఫోన్ లో చర్చలు చేసారు. ఇక, ఇప్పుడు తొలుత మంత్రి పేర్ని నానితో ఆ తరువాత సీఎంతో కలవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా విడుదల కానున్న సినిమా మేకర్స్ సైతం కోర్టుకు వెళ్లాలని భావించారు. కానీ, అది సమయం తీసుకొనే ప్రక్రియ కావటంతో.. నేరుగా చర్చల కోసం చిరంజీవిని ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ వారంలోనే సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావాలని భావిస్తున్నారు. టిక్కెట్ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని, సినీ పరిశ్రమకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
అమరావతికి చిరంజీవి..సీఎంతో చర్చలు

అమరావతికి చిరంజీవి..సీఎంతో చర్చలు

అమరావతికి చిరంజీవి..సీఎంతో చర్చలు


వకీల్ సాబ్ నుంచి పొలిటికల్ కమ్ టాలీవుడ్ వార్ ఏపీలో మొదలైంది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే తన సినిమా ఫ్రీగా నడిపిస్తానంటూ సవాల్ చేసారు. కానీ, ఇప్పుడు పవన్ నటించిన భీమ్లా వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్.. రాధే శ్యామ్ మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్నాయి. ఒక వైపు పెరుగుతున్న ఒమిక్రాన్ కలెక్షన్ల ప్రభావం పడుతుందనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇక, సంక్రాంతికి ఏపీలోనే ఎక్కువగా కలెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు థియేటర్లే మూసేస్తున్నారు. దీంతో..చిరంజీవి - నాగార్జునతో సహా సీఎంను కలుస్తారని సమాచారం. సినీ ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోలు చేసిన వ్యాఖ్యల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం రెమ్యనరేషన్ అంశం ప్రస్తావించటం టాలీవుడ్ కు మింగుడు పడటం లేదు.

సీఎం జగన్ అంగీకరించేనా

సీఎం జగన్ అంగీకరించేనా


అయితే, అక్కడే అసలు ట్విస్టు కనిపిస్తోంది. ఏపీలో సినిమా షూటింగ్ లు జరగటం లేదు. కొందరు ప్రముఖులు స్టూడియాల కోసం స్థలాలు తీసుకున్నా.. నిర్మాణాలు చేయలేదు. ఇండస్ట్రీలోని నలుగురైదుగురు ప్రముఖుల చేతుల్లోనే ఏపీలోని పలు సినిమా థియేటర్లు ఉన్నాయి. దీంతో... సినిమా టిక్కెట్లు పెంచటం వలన నిర్మాతలు- హీరోలకు మినహా ప్రభుత్వం- సాధారణ ప్రేక్షకులకు కలిగే ప్రయోజనం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశం పైన గతంలో ప్రముఖ నిర్మాత ఒకరు సీఎంను కలిసిన సమయంలోనూ స్టూడియో నిర్మాణ అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో పాటుగా మరి కొన్ని కీలక అంశాలను సైతం ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తోంది.

కొత్త సినిమాల విడుదల - అందరిలో టెన్షన్

కొత్త సినిమాల విడుదల - అందరిలో టెన్షన్


దీంతో..ఇప్పుడు సీఎం జగన్ తో చిరంజీవి సమావేశం అయినా...టిక్కెట్ల ధరల పైన చర్చించినా.. సీఎం జగన్ నిర్ణయంలో వెనక్కు తగ్గుతారా అనేది సందేహమే. ఇప్పటికే ప్రభుత్వం పైన ఎగ్జిబిటర్లు న్యాయపోరాటానికి దిగటాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే తీర్పు పైన అప్పీల్ కు వెళ్లింది. ఇక, చిరంజీవి లాంటి ప్రముఖులు వెళ్లి చర్చలు చేస్తే ..సీఎం కొంత మేర ధరలు పెంచేందుకు అంగీకరించే అవకాశం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ తో మెగాస్టార్ భేటీ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని అంచనాలు పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+