వాస్తు బాగోలేదు, అమరావతి రైతుల అభ్యంతరం - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఆర్దిక సంస్థలకు శంకుస్థాపన చేసారు. అటు కేబినెట్ లో రెండో విడత లాండ్ పూలింగ్ కు నిర్ణయించారు. లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక.. సీఎం చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ వద్ద రైతులు తాజాగా వాస్తు సమస్యను ప్రస్తావించారు. దీంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతిలో రెండో విడత లాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ శనివారం భేటీ అయింది. రైతుల సమస్యల పైన చర్చించింది. పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కాగా, ఈ సమావేశంలో వాస్తు ఇబ్బందుల పైన చర్చకు వచ్చింది. అమరావతిలో 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు ఉన్నాయని.. వాస్తు ప్రకారం కొన్ని ఇబ్బందులు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.

Amaravati farmers new objections over plots allocations Govt key assurance

156 మంది రైతులకు వాస్తు ఇబ్బందులు ఉన్నాయని తెలిపినట్లు వివరించారు. ఒక వేళ వాస్తు బాలేని రైతులు తమకు వేరే చోట కావాలని కోరితే కేటాయిస్తారని హామీ ఇచ్చారు. రైతులకు పెన్షన్, హెల్త్ కార్డు సమస్యలు ఉన్నాయని వివరించారు. హెల్త్ కార్డ్, పెన్షన్ సమస్యలు ఒక నెలలో పరిష్కారం అవుతాయని వెల్లడించారు.

కాగా, లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్నారు. అసైన్డ్ ల్యాండ్‌ను మిగిలిన భూములతో సేపరేట్ చేసి క్యాబినెట్‌లో చర్చిస్తామని అన్నారు. ప్రతి రెండు వారాలకు అందరి రైతుల సమస్యలు వింటామని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు. అదే విధంగా..అమరావతి రాజధాని రైతుల సమస్యలను త్రి సభ్య కమిటీ ఎప్పటికప్పుడు తెలుసుకుం టోందని మంత్రి నారాయణ అన్నారు. గ్రామ కంఠాల్లో ఇచ్చిన భూములు, జరీబు, నాన్ జరీబు అన్ని భూములపై దృష్టి పెడతామని చెప్పారు.

వచ్చే క్యాబినెట్‌లో అసైన్డ్ భూములు, లంక భూములపై చర్చించనున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని గ్రామాల్లో హెచ్‌డీ లైన్స్, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టామన్నారు. గ్రామకంఠాల్లో ఎవరికైతే ప్లాట్లు ఇచ్చారో వాటిపై ఉన్న అనుమానాలు నేపథ్యంలో అన్ని వెరిఫై చేయమని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. లంక భూములు విషయంలో ప్రస్తుతానికి ఇబ్బంది లేదన్నారు. ఆర్ అండ్ బి రోడ్‌లకు సంబంధించి పరిహారం తక్షణం వచ్చేలా సీఆర్డీఏ చూస్తుందని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+