నరేష్ - పవిత్రా లోకేష్ కు స్వీట్ షాక్!
నరేష్- పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను అమెజాన్ తొలగించింది.
లీగల్ ఇష్యూస్ తోనే స్ట్రీమింగ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. మళ్లీపెళ్లి సినిమా తన పరువుకు భంగం కలిగిస్తోందని, ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపేయాలంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. కేసును దృష్టిలో ఉంచుకొని అమెజాన్ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి దీన్ని తొలగించినట్లు తెలుస్తోంది.తెలుగుతో పాటు కన్నడంలో కూడా స్ట్రీమింగ్‌ను నిలిపివేసింది.

నరేష్, పవిత్రా లోకేష్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలతో దర్శకుడు ఎం.ఎస్. రాజు మళ్ళీ పెళ్లి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ సినీ ప్రేమికుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నరేష్, పవిత్రా లోకేష్ రిలేషన్ లోకి ఎలా వచ్చారో? అనే విషయాన్ని దర్శకుడు వివరించారు.
విజయకృష్ణా మూవీ బ్యానర్‌పై నరేష్ తానే స్వయంగా నిర్మించారు. వనితా విజయ్‌కుమార్, శరత్‌బాబు, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. అందరికీ తెలిసిన కథే కావడంతో థియేటర్లో ఆదరణ దక్కలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఓటీటీలో విడుదలైన తర్వాత మాత్రం మంచి వ్యూస్ దక్కించుకుంది. కోర్టు కేసులతో ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను నిలిపేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications