జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల..!!
వైసీపీ ముఖ్య నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. వరుస కేసుల్లో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో అరెస్ట్ అయిన అంబటి పైన గతంలో నమోదు అయిన కేసుల్లోనూ అరెస్ట్ చేసారు. కాగా, జనసేన నేత నమోదు చేసిన కేసులో ఈ రోజు అంబటికి బెయిల్ వచ్చింది.దీంతో, జైలు నుంచి బయటకు వచ్చిన అంబటి రాంబాబు ప్రభుత్వ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పైన కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా.. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం రాంబాబుకు బెయిల్ లభించింది. కాగా, అదే సమయంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన సమయంలో పోలీసులతో దురుసుగా వ్యవహరించటం.. అధికారుల విధులకు అడ్డంకి కలిగించారనే కేసు తెర మీదకు వచ్చింది. విచారణ తరువాత ఆ కేసులోనూ అంబటికి బెయిల్ వచ్చింది. ఆ వెంటనే జనసేన జిల్లా అధ్యక్షుడు అంబటి మంత్రిగా ఉన్న సమయంలో సత్తెనపల్లిలో లక్కీ డ్రా పేరుతో మోసం చేసారనే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా రిమాండ్ విధించారు. దీంతో, ఈ రోజు వరకు అంబటి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఈ కేసులోనూ బెయిల్ లభించింది.

ప్రభుత్వం అడ్డుకొనే ప్రయత్నం చేసిందంటూ
దీంతో, అంబటి జైలు నుంచి బయటకు వచ్చారు. తనను బయటకు రానీయకుండా ప్రభుత్వం లోని కొందరు ముఖ్యులు కుట్రలు చేసారని అంబటి ఆరోపించారు. తనను అడ్డుకోవాలని చూసారని చెప్పుకొచ్చారు. ఎన్ని రోజులైనా జైలులో ఉండాలనే నిర్ణయంతో లోపలకు వెళ్లాలనని పేర్కొన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని.. ఫలితం అనుభించాల్సిదేనని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు దాదాపుగా ఇరవై రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆయన గతంలో కూడా కేసులను ఎదుర్కొన్నా ఎప్పుడూ జలుకు వెళ్ళలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, అంబటి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది తొలి జైలు. అయితే మూడు కేసులల వల్లన ఆయన మూడు వారాల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. మాజీ ఎంపీ ఉండవల్లి సహా.. పలువురు వైసీపీ నేతలు జైలులో అంబటిని పరామర్శించారు. ఇక.. జైలు నుంచి విడుదల అయిన అంబటి రాంబాబు రేపు (గురువారం) మాజీ సీఎం జగన్ ను కలవనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications