అంబటి రాంబాబు అల్లుడు వీడియో వైరల్..వైసీపీ అదిరిపోయే కౌంటర్

ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆదివారం రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన మేనల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు లాంటి నీచుడు, శవాలమీద పేలాలు ఏరుకునే రకం. సమాజం మీద బాధ్యతలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలి. ఇలా మాట్లాడాలా? వద్దా? చాలాసార్లు ఆలోచించుకొని మాట్లాడుతున్నాను. ఈ విషయం చెప్పడాన్ని బాధ్యతగా భావిస్తున్నాను.

నిస్సిగ్గుగా పెద్ద గొంతు వేసుకొని అబద్ధాన్ని కూడా నిజం చేసేయగలమనే కాన్ఫిడెన్స్‌తో బతుకుతారు. ఎంత లేకి పని అయినా చేసి సమాజంలో చాలా గౌరవంగా బతుకుతున్నామని అనుకుంటారు. మనం కూడా ఎలాంటి వ్యక్తికి ఓటేస్తున్నామో చూసుకోవాలి. ఇలాంటి వారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి మీ సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి, మంచి నాయకుడ్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను'' అని అంబటి రాంబాబు అల్లుడు గౌతమ్ ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఈ వీడియోపై వైసీపీ స్పందించింది.

Ambati Rambabu s son-in-law s video is viral

అంబటి రాంబాబు రెండో కుమార్తె భర్తే గౌతమ్‌‌...ఇద్దరు డాకర్లు కావడంతో కూతుర్ని మేనల్లుడుకి ఇచ్చి వివాహం చేశారాయన. అయితే గౌతమ్‌తో అంబటి రెండో కూతురుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది. భర్త అరాచకాలను భరించలేక పిల్లలతో కలిసి విడిగా రాంబాబు కుమార్తె విడిగా ఉంటోంది.దీన్ని తట్టుకోలేకనే గౌతమ్ ఇలా అంబటిపై పగ తీర్చుకుంటున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలా వీడియో చేసి పెట్టడం..ఆయన దిగజారుడుకు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ ఘటన వెనుక జనసేన నేతలు ఉన్నట్టు అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి పవన్ కళ్యాణ్ మనుషులు రాంబాబు అల్లుడితో మాట్లాడి ఈ వీడియో చేయించనట్టు తెలుస్తోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం కూతురుతో కూడా ఇదే మాదిరిగా వీడియో చేయించారని..ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడుతో వీడియో చేయించారని ..రాజకీయాల్లో లబ్ధికోసం కుటుంబ సభ్యులను ఇలా వాడుకుంటోన్న పవన్ కళ్యాణ్‌కు పరిపాటిగా మారిందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+