అంబటి.. ఊర మాస్: ఎవరికి తగలాలో వారికి తగిలేలా సెటైర్లు

Ambati Rambabu dance: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి ఆరంభమైంది. నేడు భోగి పండగను వైభవంగా జరుపుకొంటోన్నారు. ఈ తెల్లవారు జామున భోగి మంటలు వెలిశాయి. రంగవల్లులతో తెలుగు లోగిళ్లు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో ఈ వారం అంతా కూడా ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం కొనసాగనుంది. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఆప్తులతో ఆయా కుటుంబాలు, ప్రత్యేకించి పల్లె ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.

భోగి పండగ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబర ఆధ్వర్యలో జరిగిన భోగీ వేడుకలు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాయి. ఇదివరకట్లాగే భోగి మంటల చుట్టూ డాన్స్ చేశారాయన. గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక భోగి వేడుకలను మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరుపుకొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రత్యేకంగా రూపొందించిన సెటైరికల్ సాంగ్ కు డాన్స్ తో అదరగొట్టారు.

Ambati Rambabu s Dazzling Dance During Bhogi Celebrations

రెండేళ్ల కిందట ఇదే భోగి పండగకు ఆయన వేసిన స్టెప్స్.. ఏ రేంజ్‌లో వైరల్‌గా అయ్యాయో తెలిసిన విషయమే. లంబాడీ మహిళలతో కలిసి భోగి మంటల చుట్టూ అంబటి చేసిన డాన్స్.. కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారిందప్పట్లో. రాజకీయంగానూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి- బ్రో సినిమాలో ఆయన డాన్స్‌పై స్పూఫ్ వేసే పరిస్థితి ఏర్పడిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేసిన డాన్స్ లను మరిపించారు.

విశాఖపట్నంలోని వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేశారు పార్టీ నాయకులు. పీపీపీ విధానంలోకి మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన జీఓ కాపీలను ఆ మంటల్లో దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+