డైనమిక్ కలెక్టర్, ఫిబ్రవరి 18న జమ్మూలో పెళ్లి: ఎవరీ ఆమ్రపాలి?
ఒంగోలు: తెలంగాణలోని వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్ ఆమ్రపాలి డైనమిక్ అంటూ పేరు తెచ్చుకున్నారు. ఆమె పేరు ఇటీవలి కాలంలో మీడియాలో మారుమోగుతోంది. ఆమె పెళ్లి ఫిబ్రవరి 18వ తేదీన జరగనుంది.
ఆమ్రపాలి ఐపిఎస్ అధికారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన 2011 ఐపిఎస్ బ్యాచ్కు చందిన షమీర్ శర్మ. జమ్ము పట్టణానికి చెందినవారు. ఆయన ఇపపుడు డయ్యూ - డామన్‌లో పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ)గా పనిచేస్తున్నారు. జమ్మూలో వారిద్దరి వివాహం జరుగుతుంది.ఫిబ్రవరి 25వ తేదీన సికింద్రాబాదులోని సికింద్రబాదు క్లబ్‌లో వివాహానంతర విందు ఉంటుంది.

ఆమ్రపాలిది ప్రకాశం జిల్లా
ఆమ్రపాలి ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని నరసాపురం ఆగ్రహారానికి చెందినవారు. దాన్ని స్థానికంగా ఆగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. రైల్వే గేటు దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంటుంది.

39వ ర్యాంక్ సాధించారు...
2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి 39వ ర్యాంక్ సాధించి, ఐఎఎస్‌లో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ట్రైనీ ఐఎఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు.
Recommended Video


ఆమ్రపాలి తండ్రి ప్రొఫెసర్
ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి చిన్నతనంలో అగ్రహారంలోనే చదువుకున్నారు. మేనకోడలు పద్మావతిని పెళ్లి చేసుకున్నారు. పద్మావతి పుట్టిల్లు టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. వెంకటరెడ్డి విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పిజీ చేశారు. అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

ఆమె కుటుంబ సభ్యులంతా ఉన్నతాధికారులే...
ఆమ్రపాలి సోదరి ఐఆర్ఎస్. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)కు ఎంపికైన ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కర్ణాటక క్యాడర్‌లో ఆదాయం పన్ను శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆమె 2007 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడుకు చెందినవారు. తమిళనాడు ఐఎఎస క్యాడర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. జయలలిత మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికకు రెండు సార్లు ఆయన ఎన్నికల అధికారిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications