Pawan Kalyan: జనసేనకు కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డుకుందెవరు..!!

కూటమిగా గెలిచిన తరువాత జనసేనకు తొలి షాక్ తగిలింది. కేంద్రంలో..రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. కేంద్రంలో మోదీ మూడో సారి ప్రధానిగా ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీకి కేంద్ర మంత్రివర్గం లో అవకాశం దక్కింది. కానీ, జనసేనకు ఛాన్స్ ఇవ్వలేదు. పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు. పవన్ ను ఇష్టపడే ప్రధాని జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు..అసలు అడ్డుపడిందెవరనే చర్చ మొదలైంది.

కొలువు తీరుతున్న ప్రభుత్వం
కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఏపీ నుంచి టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు భాగస్వామ్యం కల్పించారు. కానీ, ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కల్యాణ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నుంచి చంద్రబాబు సూచించిన ఇద్దరూ కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ నుంచి పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పురందేశ్వరి పేరు ప్రచారం జరిగినా..చివరకు నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు.

An invisible barrier Janasenas exclusion from Modis 3 0 Cabinet explained

జనసేనకు దక్కని ఛాన్స్
ఇక..జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలుపొందారు. మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో అయిదుగురు కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీల్లో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇవ్వాలని ఎన్డీఏలో నిర్ణయించారు. అదే విధంగా మంత్రి పదవుల కేటాయింపు జరిగింది. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. జనసేన నుంచి బాలశౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది. అయితే.. ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించ లేదు. అసలు కేంద్ర కేబినెట్ లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా..ఎవరి పేరు సూచించలేదా..లేక ఏం జరిగిందనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తి కర చర్చకు కారణంగా మారుతోంది. కేడర్ లో అసంతృప్తి కనిపిస్తోంది.

పవన్ కోరలేదా..వారే ఇవ్వలేదా
ఏపీలో ఎన్డీఏ విజయం లో పవన్ దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ, ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు. దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలని పవన్ ను ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. టీడీపీకి రెండు పదవుల్లో ఒకటి జనసేనకు ఇచ్చి..విస్తరణ సమయంలో టీడీపీకి మరోకటి ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలో రావటానికి..టీడీపీకి తిరిగి సీఎం పదవి దక్కటానికి పవన్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశం. కానీ, కేంద్ర మంత్రి పదవి విషయంలో మాత్రం జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+