ఏపీలో ఏం జరుగుతోంది?: పబ్లిక్‌గా కోడి మెడ కొరికి.. పచ్చి రక్తం పీల్చి

Anakapalli: ఏపీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ కళాకారుడు స్టేజీపైనే కోడి మెడ కొరికి చంపాడు. దాని రక్తం పీల్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జుగుప్సాకరమైన ఈ ఘటనపై పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) స్పందించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

అనకాపల్లిలో స్థానికంగా ఓ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ డాన్స్ ప్రదర్శన సందర్భంగా ఈ ఘటన సంభవించింది. ఓ కళాకారుడు శృతి మించాడు. తమిళ హీరో లారెన్స్ రాఘవేంద్ర స్వీయ దర్శకత్వంలో 2011లో విడుదలైన హారర్ కమెడీ మూవీ కాంచన సినిమాలోని విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన అనే పాటలో ఆ డాన్సర్ రెచ్చిపోయాడు.

Anakapalli police have filed an fir against a dance performer for the killing of a hen

లారెన్స్ తరహాలోనే ఎర్ర చీర కట్టుకుని ఊగిపోయాడు. ఓ కోడి మెడను కొరికాడు. శరీరంలో నుంచి మెడను వేరు చేశాడు. అందరూ చూస్తుండగానే దాని రక్తాన్ని పీల్చి తాగాడు. ఆ సమయంలో అతని ముఖం, శరీరం అంతా రక్తమయం అయింది. అతని చేతుల్లో విలవిల్లాడుతున్న ఆ కోడిని అలాగే చేతుల్లో పట్టుకుని డాన్స్ చేశాడు.

ఈ నెల 6వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కాస్త పెటా కంట్లో పడింది. వెంటనే ఆ సంస్థ ప్రతినిధులు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలు క్రూరత్వానికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు.

Anakapalli police have filed an fir against a dance performer for the killing of a hen

డాన్సర్‌తో పాటు డాన్స్ ట్రూప్ కంపెనీ విష్ణు ఎంటర్‌ప్రైజెస్, నిర్వాహకులపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. పెటా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ 429 ఆర్/డబ్ల్యూతో పాటు ప్రీవెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 11 (1) (ఏ) కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+