అనంతలో గ్యాంగ్ వార్ కాదు.. గ్రౌండ్ లొల్లిలో సంచలన నిజాలివే..!

అనంతపురం : ఇటీవల జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో గ్యాంగ్ వార్ అంటూ వెలుగుచూసిన వీడియో తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. వాట్సాప్‌లో తెగ వైరల్ అయిన ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు.. స్టూడెంట్స్ ఇలా కొట్టుకోవడమేంటని, ఇంత ఘోరమేంటని రియాక్టయ్యారు. తీరా పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి.

బయటి గొడవను కాలేజీ గ్రౌండ్స్‌కు రప్పించారు కొందరు యువకులు. ఆ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని పావుగా వాడుకుని బరితెగించారు. ఇష్టమొచ్చినట్లుగా చితకబాదడంతో అప్పటికే కిందపడిపోయిన సదరు యువకుడిని ఎగిరెగిరి తన్నుతూ పైశాచికంగా ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో దుమారం రేగింది.

స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కాదు..!

స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కాదు..!

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ వీడియోకు సంబంధించి సంచలన నిజాలు వెలుగుచూశాయి. అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో విద్యార్థులు కొట్టుకున్నారనే ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. అప్పటికే కిందపడి ఉన్న ఓ వ్యక్తిని కొందరు విచక్షణారహితంగా కొడుతుండటం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఇంత ఘోరంగా కొడతారా అనే కామెంట్లు వినిపించాయి. అయితే గొడవ జరిగింది విద్యార్థుల మధ్య కాదని.. బయటి గొడవ కాలేజీ గ్రౌండ్స్‌‌కు చేరిందనే విషయం వెలుగుచూసింది.

 కుల చిచ్చు కాదు.. గ్యాంగ్ వార్ కాదు.. మరేంటి?

కుల చిచ్చు కాదు.. గ్యాంగ్ వార్ కాదు.. మరేంటి?

సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో తెగ వైరల్ కావడంతో భిన్న కథనాలు బయటకొచ్చాయి. కొందరు స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ అంటే.. మరికొందరు కులాల గొడవ చిచ్చు రేపిందని అన్నారు. మీడియాలో కూడా భిన్న కథనాలు ప్రసారమయ్యాయి. తీరా పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆ వీడియోలో దాడికి గురైన వ్యక్తిని ఉప్పుటూరి శివ అలియాస్ శివయ్యగా నిర్ధారించారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శివను కొందరు అంతలా కొట్టడానికి యువతి విషయంలో జరిగిన గొడవ కారణమంటున్నారు.

కసిగా కొట్టారు.. కిందపడిపోయినా కూడా వదల్లేదు..!

కసిగా కొట్టారు.. కిందపడిపోయినా కూడా వదల్లేదు..!

కాలేజీ గ్రౌండ్స్‌లో శివను చితకబాదడం.. అతడు కిందపడిపోవడం.. అయినా కూడా కసిగా ఇష్టమొచ్చినట్లు దాడి చేయడం వీడియోలో కనిపించింది. దెబ్బలు తాళలేక కిందపడిపోయిన కూడా బెల్టులతో, రాళ్లతో కొట్టడం ఘోరం. అంతేకాదు ఎగిరిగెరి తన్నడం చూసి అత్యంత పాశవిక చర్యగా నెటిజన్లు పెదవి విరిచారు.

వాస్తవానికి జూన్ 25వ తేదీ మంగళవారం నాడు పట్టపగలు జరిగిన ఆ ఘటన.. 28వ తేదీ శుక్రవారం వీడియో రూపంలో వెలుగుచూసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అదే రోజు రాత్రి ఎఫ్‌ఐఆర్ బుక్ చేశారు. 29వ తేదీ శనివారం నాడు అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

పెళ్లైనా కూడా ప్రేమించిన అమ్మాయిని వేధిస్తున్నాడని..!

పెళ్లైనా కూడా ప్రేమించిన అమ్మాయిని వేధిస్తున్నాడని..!

భరత్ కృష్ణ అలియాస్ భార్గవ్ అనే వ్యక్తితో పాటు అతడి స్నేహితులు పవన్, అనిల్, కుమార్ కలిసి శివపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. గతంలో తాను ప్రేమించిన యువతికి పెళ్లైనా కూడా.. శివ వేధిస్తున్నాడనేది నిందితుల వాదన. తనను కాదని భరత్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుందని.. ఆ క్రమంలో ఆమెపై పగ సాధించడానికి తరచుగా ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని పోలీసుల దర్యాప్తులో చెప్పిన విషయం.

తన భార్యను శివ వేధిస్తున్నాడనేది భరత్ చెప్పిన మాట. అందుకే తన స్నేహితులైన ఆ ముగ్గురితో కలిసి దాడి చేశానని పోలీసులకు చెప్పాడు. అయితే శివతో పాటు తనకు మిత్రుడైన రాజేశ్ అనే విద్యార్థిని ఈ గొడవలోకి లాగాడు భరత్. అతడు ఆర్ట్స్ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం రాజేశ్‌తో శివకు ఫోన్ చేయించి కాలేజీ గ్రౌండ్స్‌కు రప్పించారు. అనంతరం అందరూ కలిసి శివను విచక్షణారహితంగా కొట్టారు.

బాధితుడి వెర్షన్ మరోలా.. ఆ అమ్మాయితో మాట్లాడి ఏడాదైంది..!

బాధితుడి వెర్షన్ మరోలా.. ఆ అమ్మాయితో మాట్లాడి ఏడాదైంది..!

భరత్, అతడి స్నేహితులు చేసిన దాడితో శివకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో శివ చెబుతున్న వెర్షన్ మరోలా ఉంది. తనకు మిత్రుడైన రాజేశ్ పిలిస్తే కాలేజీ గ్రౌండ్స్‌కు వెళ్లానని.. అంతలోనే భరత్ వారి ఫ్రెండ్స్ కలిసి పిడిగుద్దులు కురిపించారనే విషయం పోలీసులకు వివరించాడు. అసలు భరత్ భార్యతో ఇటీవల తాను మాట్లాడలేదని వాపోయాడు. ఆమెతో మాట్లాడి ఏడాది దాటిందని.. అసలు తాను ఆ యువతి జోలికి వెళ్లడం లేదని తెలిపాడు. ఏదో మనసులో పెట్టుకుని, చేయని తప్పును తనపై రుద్ది ఇలా తీవ్రంగా కొట్టారని.. తనకు న్యాయం చేయాలని కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+