అనసూయ పొలిటికల్ ఎంట్రీ - పార్టీ, పోటీ పై క్లారిటీ..!!
యాంకర్ అనసూయ గ్లామర్ ఫీల్డ్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా. కొద్ది రోజులుగా ఈ ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల రాజకీయం కొనసాగుతోంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ సమయంలో బుల్లి తెర తో పాటుగా సినిమాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింది. ఈ సమయంలో అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి తన ఆలోచన స్పష్టం చేసారు.
ఎన్నికల రాజకీయం : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ పైన ఇప్పటికే షెడ్యూల్ జారీ అయింది. ఇటు ఏపీలోనూ ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో చోటు చేసుకున్న రాజకీయ ఘటనల ఆధారంగా ఎన్నికల సమయంలో సినిమాలు విడుదల అవుతున్నాయి.

తాజాగా రజాకార్ సినిమా పైన భిన్న వాదనలు తెర మీదకు వస్తున్నాయి. అటు ఏపీలో వైఎస్సార్ - జగన్ రాజకీయ జీవితం ఆధారంగా యాత్ర -2, వ్యూహం సినిమాలు సిద్దం అవుతున్నాయి. యాత్ర-2 సినిమా విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించారు. వ్యూహం ప్రముఖ దర్శకుడు ఆర్జీవి తెరకెక్కిస్తున్నారు.
అనసూయ పొటికల్ ఎంట్రీ : ఇక, ఇప్పుడు ఈ రాజకీయ వార్తల్లోకి ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ చేరారు.మంచి యాంకర్ .. నటిగా అనసూయ నిరూపించుకున్నారు. బుల్లి తెరలో యాంకర్ గా ప్రారంభించి..రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె 'రజాకర్' అనే సినిమాలో నటిస్తోంది.
తాజాగా ఈ చిత్రంలో పాట రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ మూవీ రాజకీయ నేపథ్య కథ కావడం, నిర్మాత బీజేపీ నాయకుడు కావడంతో.. అనసూయకు కూడా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని గతంలో ప్రచారం సాగటంతో..ఇప్పుడు ఆ దిశగా నిర్ణయం తీసుకొనే సమయం వచ్చిందనే చర్చ మొదలైంది. దీని పైనే ఇప్పుడు అనసూయ క్లారిటీ ఇచ్చారు.

రాజకీయాలపై క్లారిటీ : సినీ హీరోయన్లతో పాటుగా జబర్ధస్త్ షో ప్రముఖులు సైతం రాజకీయంగా బిజీ అయ్యారు. మంత్రిగా రోజా, జనసేనలో కీలక నేతగా నాగబాబు ఉండగా... హైపర్ ఆది జనసేనానికి మద్దతుగా నిలుస్తున్నారు. సినిమా ఈవెంట్స్ లో పొలిటికల్ పంచ్ లు పేలుస్తున్నారు. ఇక, ఇప్పుడు హాట్ బ్యూటీగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అనుసూయ తన పొలిటికల్ ఎంట్రీ పైన స్పష్టత ఇచ్చారు.
రాజకీయం తన వల్ల కాదని తేల్చేసారు. చెప్పాలంటే తనకు ఆ ఇంట్రెస్ట్ లేదన్నారు. వాళ్ల(పొలిటిషియన్స్) పని వాళ్లని చేయనిద్దామని అసలు విషయం పై క్లారిటీ ఇచ్చారు. రజాకార్ మూవీ నిర్మాత బీజేపీ నాయకుడు కావటంతో.. ఆయన తమ పార్టీలోకి ఆహ్వానిస్తారా అంటే..అసలు ఆ చర్చే లేదని పూర్తిగా పొలిటికల్ డిస్కషన్ ను ముగించేసారు.












Click it and Unblock the Notifications